జాక్ సెన్సార్ ఫినిష్.. గెట్ రెడీ!

ఇదిలా ఉండగా, 'జాక్' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది.;

Update: 2025-04-07 06:11 GMT
జాక్ సెన్సార్ ఫినిష్.. గెట్ రెడీ!

టాలీవుడ్ యూత్ ఫేవరేట్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈసారి స్పై యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'డిజే టిల్లు' లాంటి హిట్స్ తర్వాత వచ్చిన హైప్‌ను 'టిల్లు స్క్వేర్' తో డబుల్ చేసిన సిద్ధు.. ఇప్పుడు 'జాక్' అనే మరో క్రేజీ కథతో స్క్రీన్ మీద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రమోషన్స్ ఊపు మీద ఉన్నాయి.

ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్‌తో పాటు ఫన్‌ను మిక్స్ చేస్తూ కొత్తగా అనిపిస్తోంది. ముఖ్యంగా సిద్ధు అందించిన ఎంటర్టైన్మెంట్‌కు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సిద్ధు స్టైల్, యాక్షన్ టచ్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ఇదిలా ఉండగా, 'జాక్' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. అంటే కుటుంబ సమేతంగా చూసే సినిమాగా భావించొచ్చు. సినిమాలో యాక్షన్, స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా, అవన్నీ కూడా ఓ లిమిట్‌లోనే ఉండటంతో బోర్డు ఈ సర్టిఫికేట్ ఇచ్చింది. అందులోనూ సిద్ధు పాత్ర ఓ ప్రైవేట్ స్పై ఏజెంట్‌గా ఉండటంతో.. మిషన్ బటర్‌ఫ్లై పేరుతో జరిగే కథనానికి సంబంధించిన కంటెంట్‌ హైలెట్ అయినట్లు సమాచారం.

సెన్సార్ పూర్తయిన నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. మొత్తం సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. కథ వేగంగా నడిచేలా కథానాయిక పాత్ర, టెర్రరిస్ట్ మిషన్, స్పై ఎలిమెంట్స్ అన్నింటినీ కాంపాక్ట్‌గా ప్లాన్ చేశారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ నిడివి కమర్షియల్ థ్రిల్లర్స్‌కు పర్ఫెక్ట్ లెంగ్త్ అని చెప్పొచ్చు. మధ్యలో ల్యాగ్ లేకుండా రన్ అవుతుందని టాక్.

ట్రైలర్ ద్వారా.. ఈ సినిమా యాక్షన్‌తో పాటు కామెడీ పాయింట్లతోనూ నడవనుందని క్లారిటీ వచ్చేసింది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తుండగా, సిద్ధు ఆయనతో ఫన్ డైలాగ్ లు పంచుకోవడం మరో హైలైట్ కానుంది. విలన్లను బురుడి కొట్టించేలా మారువేషాల్లో చేసే మిషన్ బటర్‌ఫ్లై ఆపరేషన్, సరదా రొమాన్స్ కలిసిపోయి కథను ఆసక్తికరంగా మలచినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో చూపించిన యాక్షన్ షాట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఇప్పటికే సిద్ధు క్రేజ్‌ను బట్టి సినిమా ఓపెనింగ్స్ స్ట్రాంగా గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు సెన్సార్ పూర్తి కావడం, క్లియర్ రన్ టైమ్ రావడం, అఫీషియల్‌గా రిలీజ్ కౌంట్‌డౌన్ మొదలయ్యింది. ఏప్రిల్ 10న 'జాక్' థియేటర్లలో విడుదల కానుంది. సిద్ధు ఈసారి ఎంతవరకు అలరిస్తాడో, 'జాక్' బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయం అందుకుంటుందో చూడాల్సిందే.

Tags:    

Similar News