సిద్ధు జొన్నలగడ్డ 'జాక్'.. ఏమైంది? ఎందుకిలా?

ఇంకా మూవీ రిలీజ్ కు రెండు రోజులే ఉన్నాయి. ప్రస్తుతానికి జాక్ మూవీ ఫీవర్.. ఆడియన్స్ లో కనిపించడం లేదు!;

Update: 2025-04-08 05:40 GMT
సిద్ధు జొన్నలగడ్డ జాక్.. ఏమైంది? ఎందుకిలా?

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. టిల్లు సిరీస్ చిత్రాల తర్వాత ఆయన అప్ కమింగ్ సినిమాలపై మూవీ లవర్స్ ఫోకస్ పడింది. అదే సమయంలో ఇప్పుడు సిద్ధు.. జాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానుందా చిత్రం.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన జాక్ లో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు. అయితే ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. రీసెంట్ గా ట్రైలర్.. మూవీపై హోప్స్ క్రియేట్ చేసింది. సిద్ధు, భాస్కర్ మార్క్ క్లియర్ గా కనిపించాయి. కావాల్సినంత ఫన్ ఉంది.

అదే సమయంలో సిద్ధు మూవీ అంటే చాలు.. కచ్చితంగా భారీ అంచనాలు నెలకొంటాయి. మొన్న టిల్లు స్క్వేర్ కు ఎలాంటి బజ్ నెలకొందో మనం చూశాం. కానీ ఇప్పుడు జాక్ మూవీ విషయంలో అలాంటిదేం లేదు. ఇంకా మూవీ రిలీజ్ కు రెండు రోజులే ఉన్నాయి. ప్రస్తుతానికి జాక్ మూవీ ఫీవర్.. ఆడియన్స్ లో కనిపించడం లేదు!

అయితే అందుకు కారణాలివేనని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. సినిమాలో పాకిస్తాన్ తీవ్రవాదులను పట్టుకునే పాయింట్ ఉన్నట్లు ట్రైలర్ ద్వారా ఇప్పటికే అర్థమైంది. ఆ పాయింట్ పై ఇప్పటికే కొందరు డైరెక్టర్స్ సినిమాలు చేశారు. ఇప్పుడు భాస్కర్ కూడా అదే పాయింట్ ను తీసుకున్నారు.

కానీ దానికి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి కొత్తగా మూవీ తీసినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయం ఇంకా మాస్ పీపుల్ కు రీచ్ అవ్వలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సిద్ధు గత సూపర్ హిట్ మూవీస్ డీజే టిల్లుకు నేహా శెట్టి, టిల్లు స్క్వేర్ కు అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ ప్లస్ అయ్యిందని గుర్తు చేస్తున్నారు

ఇప్పుడు జాక్ లో వైష్ణవి చైతన్య గ్లామర్ అంతగా ఉన్నట్లు తెలియడం లేదని, అందుకే యూత్ లో మూవీ ఇంకా స్పీడ్ గా రీచ్ అవ్వలేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ప్రమోషన్స్ ను ఇంకాస్త వైరెటీగా మేకర్స్ చేపడితే బాగుండేదని అన్నారు. సాంగ్స్ ఓకే అయినా.. ట్రెండింగ్ లోకి రావడం లేదని చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా పాజిటివ్ మౌత్ టాక్ వస్తే మూవీకి తిరుగులేదు. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News