ఆ మూవీ వల్ల 'జాక్'కు 'హెడ్ ఏక్'.. ఏం జరుగుతుందో?

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన మూవీ జాక్.;

Update: 2025-04-05 05:36 GMT
Distributor Dispute Threatens Jack Movie Release

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన మూవీ జాక్. రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు గ్రాండ్ గా నిర్మించారు. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ జాక్.

అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఆ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మూవీ నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. దీంతో ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న జాక్ కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

కానీ ఇప్పుడు కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మారిన మూవీ.. జాక్ కు హెడ్ ఏక్ గా మారింది. అన్ని విషయాల్లో అడ్డు పడుతోంది. దీంతో ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. జాక్ మూవీ నిర్మాతలు ప్రసాద్, బాపినీడు.. గతంలో గాండీవధారి అర్జున సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఆ సినిమా.. దారుణంగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అసలు సినిమా ఆడలేదని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ లో సగానికి పైగా నష్టం వచ్చిందని అప్పట్లో టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ నష్టం.. జాక్ కు హెడ్ ఏక్ గా మారింది.

ఇప్పటికే గాంఢీవదారి అర్జున సినిమాను కొన్న గోదావరి ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు.. ఛాంబర్ ను ఆశ్రయించారు. అప్పుడు పూర్తిగా నష్టపోయామని.. రికవరబుల్ అడ్వాన్స్ కింద మూవీని కొన్నామని చెప్పారు. కానీ తమకు ఎలాంటి డబ్బులు రిటర్న్ ఇవ్వలేదని, కాబట్టి అది క్లియర్ అయ్యేవరకు జాక్ రిలీజ్ ఆపాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

అయితే ఆ విషయంపై ఛాంబర్ చాలా సీరియస్ గా ఉందని.. ఆ ఇష్యూ క్లియర్ చేయాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఇష్యూ సెటిల్ అవ్వకపోతే జాక్ రిలీజ్ కు ఇబ్బందులే. ఇప్పటికే గోదావరి డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఫిర్యాదు చేశారు. మిగతా బయ్యర్లు అదే ఫాలో అయితే జాక్ ప్రొడ్యూసర్లకు సవాలే. ఏదేమైనా ఇప్పటికైనా సెటిల్మెంట్ కు వెళ్లడం బెటర్. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News