సిద్ధు జాక్.. పాత తలనొప్పి ఇప్పుడు మళ్లీ..

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. జాక్ మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-04-03 10:29 GMT
సిద్ధు జాక్.. పాత తలనొప్పి ఇప్పుడు మళ్లీ..

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. జాక్ మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బేబీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత బాపినీడు గ్రాండ్ గా నిర్మించారు.

ఇప్పటికే మంచి అంచనాలు నెలకొల్పిన జాక్ మూవీ.. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానుంది. ఆ నేపథ్యంలో మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్.. సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఇప్పుడు జాక్ నిర్మాత బాపినీడుకు పెద్ద తలనొప్పి వచ్చిందని అంతా కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడిదో సమస్య ఇంకా వెంటాడుతోందని అంటున్నారు.

రెండేళ్ల క్రితం గాండీవధారి అర్జున మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఆ సినిమాను బాపినీడు నిర్మించారు. యాక్షన్‌ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిన ఆ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. దీంతో నిర్మాత భారీగా నష్టపోయారు. పెట్టుబడిలో సగం కూడా రాలేదని వార్తలు వచ్చాయి.

అయితే ఆ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారుకు మరో మూవీ చేసే ఛాన్స్ రాలేదు. అది పక్కన పెడితే.. ఇప్పుడు బాపినీడుకి మాత్రం ఇంకా ఆ మూవీతో వచ్చిన సమస్య వెంటాడుతోంది. గాండీవధారి అర్జునతో తగిలిన షాక్ తర్వాత ఇప్పుడు జాక్ మూవీ నిర్మించారు బాపినీడు. మరో వారంలో సినిమా రిలీజ్ కానుంది.

ఇప్పుడు గాండీవధారి అర్జున వల్ల జాక్ రిలీజ్ విషయంలో తలనొప్పి ఎదురైంది. అప్పుడు గాండీవధారి అర్జున మూవీని కొనుగోలు చేసిన అనుశ్రీ సత్యనారాయణ, ప్రవీణ్ ఇప్పుడు లోకల్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఈస్ట్ అండ్ వెస్ట్ కోసం అప్పుడు కొన్నారు. రికవరబుల్ షరతు మీద తీసుకున్నామని, కానీ మూవీ అసలు వసూలు చేయలేదని ఇప్పుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమకు నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదని, ఆ వ్యవహారం ఇంకా క్లియర్ అవ్వలేదని తెలిపారు. అందుకే అది సెటిల్ అయ్యే వరకు జాక్ సినిమా విడుదలను ఆపాలని కోరారు. అయితే వాళ్లు ఫిర్యాదు చేసినంత మాత్రాన మూవీ రిలీజ్ ఆగే అవకాశం లేదు. కానీ ఎప్పటికైనా అది తలనొప్పి వ్యవహారమే. కాబట్టి ఆ సెటిల్ మెంట్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాపినీడు ఏం చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News