సిద్ధు జొన్నలగడ్డ 'జాక్'.. ట్రైలర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2025-04-03 06:37 GMT
సిద్ధు జొన్నలగడ్డ జాక్.. ట్రైలర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తన కొత్త మూవీ జాక్ తో ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు.


శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న జాక్ మూవీ షూటింగ్ పూర్తైంది. దీంతో రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. అదే సమయంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అవ్వగా.. జాక్ ట్రైలర్ ను గురువారం ఉదయం రిలీజ్ చేశారు.

ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్.. ఫోర్ సిటీస్.. ఫోర్ టెర్రరిస్ట్స్.. అంటూ ప్రకాష్ రాజ్ చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. నలుగురు టెర్రిరస్టులను పట్టుకునేందుకు టీమ్ ను సెట్ చేస్తారాయన. అదే సమయంలో క్రేజీ డైలాగ్ తో సిద్ధు ఎంట్రీ ఇచ్చారు. ఆయన బయట జాలిగా కనిపిస్తూ.. రకరకాల వేషాలతో కనిపించి సందడి చేశారు.

అండర్ కవర్ ఆపరేషన్ చేసేందుకు సిద్ధూ.. మారువేషాల్లో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. తన మిషన్ బటర్ ఫ్లై అని చెబుతాడు. ప్రైవేట్ స్పై ఏజెంట్ అని అర్థమవుతోంది. అప్పుడే హీరోయిన్ తో లవ్ లో పడతాడు. అయితే అసలు జాక్ కు మిషన్ కు ఏంటి సంబంధం? ఏం జరిగింది? టెర్రరిస్టులను పట్టుకున్నారా? అనేది సినిమాగా తెలుస్తోంది.

అయితే సిద్ధు తన యాక్టింగ్ తో మరోసారి మెప్పించారు. తన కామెడీ టైమింగ్ తో అలరించారు. తన మార్క్ ను చూపించారు. ఆయన లుక్స్ ఎప్పటిలాగానే క్రేజీగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ తో సంభాషణలు బాగున్నాయి. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో హీరో అదరగొట్టారు. యాక్షన్, ఫన్.. రెండు సమానంగా పంచనున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో కంటెంట్ స్పెషల్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. బాగుందనే చెప్పాలి. నిర్మాణ విలువలతోపాటు సినిమాటోగ్రఫీ అదిరిపోయాయి. కొంచెం క్రాక్ అని ట్యాగ్ లైన్ ఇవ్వగా.. అందుకే తగ్గట్లే మూవీ ఉంటుందని ట్రైలర్ చెబుతోంది. సినిమాపై ఉన్న అంచనాలను పెంచుతోంది. మరి జాక్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో.. సిద్ధు ఎలా అలరిస్తారో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News