నీకు నాకు బలుపు ఎక్కువే.. జగ్గు భాయ్ రాక్స్..!

అందులో కాకర కాయ జ్యూస్, బెండకాయ జ్యూస్, పెరుగు అన్న ఉన్నాయి.

Update: 2024-09-28 10:53 GMT

జగ్గు భాయ్ అలియాస్ జగపతి బాబు తనకు వచ్చిన స్పెషల్ రోల్స్ చేస్తూ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తారు. ఎప్పూ చిల్ గా తన మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడే జగపతి బాబు లేటెస్ట్ గా మంచు వారమ్మాయి మంచు లక్ష్మితో చేసిన చిట్ చాట్ ఆడియన్స్ ని అలరించింది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కోసం మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గురించి ఒక వీడియో చేశారు జగపతి బాబు. నిద్ర లేచినప్పటి నుంచి ఎక్సర్ సైజ్ చేసే వరకు ఎలాంటి డైట్ తీసుకుంటారన్నది చెప్పారు.

అందులో కాకర కాయ జ్యూస్, బెండకాయ జ్యూస్, పెరుగు అన్న ఉన్నాయి. ఇవి తన రొటీన్ మార్నింగ్ డైట్ అని చెప్పార్. ఐతే ఈ వీడియోకు మంచు లక్ష్మి రిప్లై ఇచ్చింది. బెండకాయ్ జ్యూస్ ఎందుకు అని జగపతి బాబుని అడిగింది. దానికి ఆయన సమాధానం ఇస్తూ లచ్చిమి.. బెండకాయ రసం కొలెస్ట్రాల్ కి మంచిది. నాకు నీకు కొవ్వు ఎక్కువ కాబట్టి మనకి చాలా అవసరమని రిప్లై ఇచ్చారు. తను చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పే జగపతి బాబు ఆన్సర్ కి మంచు లక్ష్మి షాక్ అయ్యింది.

ఇక అందుకు బదులుగా నాకు అన్నీ బాగానే ఉన్నాయ్ అన్నో.. మెంటల్ ఇష్యూస్ తప్ప.. ఇంకా ఏమీ లేదు అని అన్నది. సో ఈ సంభాషణ అంతా సోషల్ మీడియా ఫాలోవర్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. మంచు లక్ష్మి అడిగిన ప్రశ్నకు జగపతి బాబు చెప్పిన సమాధానం ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కు దారి తీసింది. మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఇక జగపతి బాబు గురించి చెప్పాంటే ఈమధ్యనే వచ్చిన మిస్టర్ బచ్చన్ లో నటించిన జగపతి బాబు పుష్ప 2 లో నటిస్తున్నారు. ప్రతినాయకుడిగా టర్న్ తీసుకున్నప్పటి నుంచి దాదాపు 100 సినిమాల దాకా చేసిన జగపతి బాబు వాటిలో మనసుకి నచ్చిన పాత్రలు చాలా తక్కువ అని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. కేవలం జాబ్ శాటిస్ఫ్యాక్షన్ కోసం కొన్నైతే అన్ని జేబు శాటిస్ఫ్యాక్షన్ కోసమే అని చెప్పి షాక్ ఇచ్చారు.

Tags:    

Similar News