ఫోటోలో త‌న‌ని క‌నిపెట్ట‌మ‌ని ఫ్యాన్స్ కు జ‌గ్గూ భాయ్ టాస్క్

తాజాగా జ‌గ‌ప‌తి బాబు త‌న ఎక్స్ అకౌంట్ లో ఒక ఫోటోను షేర్ చేశాడు. ఓ గ్రూప్ ఫోటోను షేర్ చేసి అందులో త‌న‌ని క‌నిపెట్ట‌మ‌ని త‌న ఫ్యాన్స్ కు పెద్ద టాస్కే ఇచ్చాడు.

Update: 2025-02-22 12:25 GMT

సోష‌ల్ మీడియా ట్రెండ్ బాగా పెరిగిన నేప‌థ్యంలో సెల‌బ్రిటీలు సైతం దాన్ని వాడుకుంటూ త‌మ‌ను తాము ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌మ ఫాలోవ‌ర్ల‌తో చిట్ చాట్ చేయ‌డం ద్వారానో, ఏదొక విషయం గురించి పోస్ట్ చేయ‌డం ద్వారానో వారికి ట‌చ్ లోనే ఉంటున్నారు. హీరోలు, హీరోయిన్ల ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తీ ఒక్క‌రూ ఇదే ఫాలో అవుతున్నారు.

 

కొంత‌మందైతే ఎప్పుడూ ఏదొక విష‌యం గురించి మాట్లాడుతూ, అప్డేట్స్ ఇస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ ఉంటారు. ఇక అస‌లు విష‌యానికొస్తే అల‌నాటి హీరో, ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తున్న జగ‌ప‌తి బాబు కూడా ఈ సోష‌ల్ మీడియాను తెగ వాడేస్తున్నాడు. నెట్టింట ఎప్పుడూ ఏదొక‌టి పోస్ట్ చేస్తూ త‌న ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటున్నాడు జ‌గ్గూ భాయ్.

తాజాగా జ‌గ‌ప‌తి బాబు త‌న ఎక్స్ అకౌంట్ లో ఒక ఫోటోను షేర్ చేశాడు. ఓ గ్రూప్ ఫోటోను షేర్ చేసి అందులో త‌న‌ని క‌నిపెట్ట‌మ‌ని త‌న ఫ్యాన్స్ కు పెద్ద టాస్కే ఇచ్చాడు. జ‌గ్గూ భాయ్ షేర్ చేసింది బాగా పాత ఫోటో అవ‌డం వ‌ల్ల అత‌న్ని వెంట‌నే గుర్తు ప‌ట్ట‌డం అంత సుల‌భం కాలేదు కానీ మొత్తానికి ఆ ఫోటోలో జ‌గ‌ప‌తి బాబు ఎక్క‌డున్నాడో ఫ్యాన్స్ క‌నిపెట్టేశారు. జ‌గ్గూ షేర్ చేసిన ఈ ఫోటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.

సోష‌ల్ మీడియాను బాగా వాడుతూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జ‌గ్గూ భాయ్, తాను వెకేష‌న్ కు వెళ్లినా అక్క‌డి నుంచి ఫోటోల‌ను షేర్ చేస్తాడు. ఏమీ లేక‌పోతే త‌న డైట్ కు సంబంధించిన విష‌యాల్నైనా షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ఎప్పుడూ ట‌చ్ లోనే ఉంటాడు. రోడ్ సైడ్ ధాబాలో ఫుడ్ తినే విషయాన్ని కూడా ఫ్యాన్స్ కు షేర్ చేస్తూ త‌నెంత సింపుల్ గా ఉంటున్నాడో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు జ‌గ‌ప‌తి బాబు.

ఇక కెరీర్ విష‌యానికొస్తే ప‌లు హిందీ, త‌మిళ సినిమాల్లో విల‌న్ గా న‌టిస్తున్న జ‌గ్గూ భాయ్ కు తెలుగు లో వ‌చ్చినంత క్రేజ్, డిమాండ్ వేరే భాష‌ల్లో ద‌క్క‌డం లేదు. క‌న్న‌డ లో కూడా ఆయ‌న అప్పుడ‌ప్పుడు ఒక్కో సినిమాలో మెరుస్తున్నాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న జ‌గ్గూ భాయ్ కు రామ్ చ‌ర‌ణ్- బుచ్చిబాబు కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఆర్సీ16లో మంచి పాత్ర ద‌క్కింద‌ని చెప్తున్నారు.

Tags:    

Similar News