రాజకీయాల నుంచి సినిమాల్లోకి ఒకే ఒక్కడు!
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లీడర్ గా ఉన్న జగ్గారెడ్డి రాజకీయంగా చాలా సీనియర్. ఆరంగంలో అపార అనుభవం సంపాదించారు.;

సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాత రాజకీయల్లోకి వెళ్లిన నటులు ఎంతో మంది. ఎన్టీఆర్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మురళీ మోహన్, కృష్ణ, కృష్ణం రాజు, రోజా ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్లంతా రాజకీయాల్లో మంచి పేరు సంపాదించారు. అటుపై చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీతో ప్రజల్లోకి వెళ్లారు కానీ సీఎం మాత్రం కాలేకపోయారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా కొన్నాళ్లు బాధ్యతలు వహించారు. అటుపై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి మంచి సక్సెస్ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో చేతులు కలపడంతో పవన్ కళ్యాణ్‌కి సక్సెస్ వచ్చింది. ఇలా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లింది చాలా మంది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు. బాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ ఇలా చాలా పరిశ్రమల్లో నటులుగా సక్సెస్ అయిన తర్వాతే రాజకీయ నాయకులుగానూ సక్సెస్ అయ్యారు. అయితే రాజకీయాల నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు మాత్రం ఒకే ఒక్కరు. అతడే జగ్గారెడ్డి.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లీడర్ గా ఉన్న జగ్గారెడ్డి రాజకీయంగా చాలా సీనియర్. ఆరంగంలో అపార అనుభవం సంపాదించారు. వివిధ పదువులు చేపట్టారు. అలాంటి నాయకుడి మనసు ఇప్పుడు సినిమాలు కోరుకోవడంతో 58 ఏళ్ల వయసులో నటుడిగా తెరంగేట్రం చేసారు. `జగ్గారెడ్డి` టైటిల్ తో తెరకెక్కుతోన్న చిత్రంలో జగ్గారెడ్డి మెయిన్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రామానుజం తెరకెక్కిస్తున్నాడు.
ఓయువ జంట ప్రేమ కథానేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆ యువ జంట ప్రేమకు అండగా నిలిచే పెద్ద తరహా పాత్రలో జగ్గారెడ్డి కనిపిస్తారు. అలాగని జగ్గారెడ్డిలో యూత్ యాంగిల్ ని టచ్ చేయలేదు అను కోవద్దు. వయసులో ఉన్నప్పుడు జగ్గారెడ్డి చేసిన అల్లరి కూడా సినిమాలో హైలైట్ అవుతుంది. జగ్గారెడ్డి వయసులో ఉన్న పాత్రను ఓ యువ నటుడు పోషిస్తున్నాడు. జగ్గారెడ్డి స్టూడెంట్ లైఫ్...లీడర్ గా ఎదిగిన విధానం ఇవన్నీ కూడా జగ్గారెడ్డిలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన జగ్గారెడ్డి పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.