పెళ్లి చేసుకోవ‌ద్దని చిన్న కూతిరికి జ‌గ్గుభాయ్ స‌ల‌హా!

తాజాగా ఆమె పెళ్లి ప్ర‌స్తావ‌న‌రాగా? చిన్న పాప‌ని పెళ్లి చేసుకోవ‌ద్దు అని జ‌గ‌ప‌తి బాబు చెప్పారు. 'ఇది నా ఒపినీయ‌న్ గా చెప్పా. నేనైతే బ‌ల‌వంతంగా పెళ్లి చేయను. నీకు న‌చ్చితే చేసుకో. లేకపోతో లేదు.

Update: 2024-10-30 02:30 GMT

జ‌గ‌ప‌తి బాబు అలియాస్ జ‌గ్గుభాయ్ వ్య‌క్తిత్వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తాను ఏది అనుకున్నా సుత్తి లేకండా సూటిగా చెప్పేస్తారు. నిర్మొహ మాటంగా మాట్లాడుతారు. ఏ విష‌యంపైనా త‌న‌కు తెలిస్తే మాత్రం అంతే ఓపెన్ గా స‌మాధానం ఇస్తారు. ఇది అత‌డి నైజం. జ‌గ్గుభాయ్ లోనూ రాం గోపాల్ వ‌ర్మ ఉన్నారా? అన్న సందేహం అప్పుడ ప్పుడు ప్రేక్ష‌కుల‌కు వ‌స్తుంటుంది. ఆయ‌నలా డిఫ‌రెంట్ గా థింక్ చేయ‌డం...మాట్లాడే విధానం..ఓపెన్ మైండెడ్ వ్య‌క్తిత్వం వంటివి వ‌ర్మ‌కు సింక్ అవుతుంటాయి.

జ‌గ‌ప‌తి బాబు పెద్ద కుమార్తె విదేశీయుడిని పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అది ప్రేమ వివ‌హం. ఆ స‌మ‌యంలో విదేశీయుడుని పెళ్లి చేసుకోవ‌డం ఏంటి అనే విమ‌ర్శ‌లు..అలాంటి పెళ్లి వ‌ద్దు అని జ‌గ‌ప‌తి బాబుకి చాలా మంది స‌ల‌హాలిచ్చారు. కానీ కుమార్తె ఇష్ట‌ప‌డి చేసుకుంటాను? అనుకున్న‌ప్పుడు నేనేవ‌రినీ అడ్డు చెప్ప‌డానికి అని పూర్తి స్వేచ్ఛ‌నిచ్చి పెళ్లి చేసారు. ఇంకా ఆయ‌న చిన్న కుమార్తె ఒక‌రుంది. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు.

తాజాగా ఆమె పెళ్లి ప్ర‌స్తావ‌న‌రాగా? చిన్న పాప‌ని పెళ్లి చేసుకోవ‌ద్దు అని జ‌గ‌ప‌తి బాబు చెప్పారు. 'ఇది నా ఒపినీయ‌న్ గా చెప్పా. నేనైతే బ‌ల‌వంతంగా పెళ్లి చేయను. నీకు న‌చ్చితే చేసుకో. లేకపోతో లేదు. ఆ సంబంధం కూడా నువ్వే వెతుక్కో. నేను వెత‌క‌ను. పెళ్లి చేయడం అన్న‌ది బాధ్య‌త క‌దా? అంటే తొక్క‌లో బాధ్య‌త అది నేను అస్స‌లు న‌మ్మ‌ను అని జ‌గ‌ప‌తి బాబు స‌మాధానం ఇచ్చారు. బాధ్య‌త అనేది త‌ప్పుడు ప‌దం.

ఇది నా ఒపినీయ‌న్ మాత్ర‌మే. ప్రేమ ముఖ్య‌మా? బాధ్య‌త ముఖ్య‌మా? అంటే ప్రేమ ముఖ్య‌మంటాను. ప్రేమ పంచాలి గానీ బాధ్య‌త పేరుతో ఇష్టం లేని నిర్ణ‌యాలు తీసుకోకూడ‌దు క‌దా. అలాంట‌ప్పుడు అక్క‌డ ప్రేమ ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకున్న త‌ర్వాత పిల్ల‌ల్ని క‌న‌మంటాం. అది స్వార్దం అవుతుంది త‌ప్ప బాద్య‌త కాదు. పెద్ద పాప పిల్ల‌లు వ‌ద్దు అనుకుంటున్నాం అంది. అది నీ ఇష్టం. నువ్వు తీసుకోవాల్సిన నిర్ణ‌యం నాకెందుకు చెబుతున్నావ్ అన్నాను' అన్నారు.

https://www.facebook.com/reel/941374241379626

Tags:    

Similar News