'జైలర్-2'ని కమల్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారా?
సన్ పిక్చర్స్ రజనీకాంత్ తో తాజాగా భేటీ అయిన ఓ వీడియో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.
కోలీవుడ్ కి ఇంత వరకూ 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం ఒక్కటీ లేదు. 500-700 కోట్ల మధ్యలోనే కోలీవుడ్ సినిమా పాన్ ఇండియాలో రాణించింది. టాలీవుడ్, శాండిల్ వుడ్ భారతీయ చిత్ర పరిశ్రమల్లో దూసుకుపోతుంటే కోలీవుడ్ మాత్రం ఈ రేసులో బాగా వెనుకబడే ఉంది. మరి 'జైలర్ -2' కోలీవుడ్ కి 1000 కోట్ల క్లబ్ సాధ్యమేనా? అంటే చాలా వరకూ అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్' 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
దీంతో 'జైలర్-2' ప్రకటన విషయంలో నెల్సన్ -రజనీకాంత్ మరో ఆలోచన లేకుండా ప్రకటించారు. అప్పటి నుంచి నెల్సన్ 'జైలర్ -2' స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఆ స్క్రిప్ట్ ని సానబెడుతున్నాడు. 'జైలర్' ని మించి రెండవ భాగం ఉండాలని ప్లాన్ చేసి బరిలోకి దిగుతున్నారు. దీనిలో భాగంగా సూపర్ స్టార్ తో పాటు మరికొంత మంది స్టార్ క్యాస్టింగ్ కూడా యాడ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మొత్తం వివరాలు జనవరి 14న ప్రకటించబోతున్నట్లు సమాచారం.
సన్ పిక్చర్స్ రజనీకాంత్ తో తాజాగా భేటీ అయిన ఓ వీడియో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. 'జైలర్ -2' కి సంబంధించిన డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో 'జైలర్ -2'ని భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు మరోసారి క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో అభిమానులు సైతం ఈసారి కోలీవుడ్ కి 1000 కోట్లు పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని కమల్ హాసన్ అభిమానులు జీర్ణించుకో లేకపోతు న్నట్లు కనిపిస్తుంది.
'జైలర్ -2'కి సంబంధించి ఇలాంటి ముందస్తు అంచనాలు అప్పుడే అవసరం లేదంటూ నెగిటివ్ కామెంట్లతో విరిచు కుపడుతున్నారు. 'జైలర్ -2' ని 'ఇండియన్ -2' చిత్రంతో సరిపోల్చుతున్నారు. మరి ఉన్నట్లుంది ఈ రకమైన ఎటాకింగ్ కి కమల్ అభిమానులు ఎందుకు దిగినట్లు? అన్నది ఆసక్తికరం.