జైలర్ -2 లో ఆ స్టార్లు అంతా భాగమేనా?
మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి టాప్ స్టార్లు గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వడంతోనే ఇది సాద్యమైంది.
సూపర్ స్టార్ రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన 'జైలర్' ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 650 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చాలా కాలం తర్వాత రజనీకి పర్పెక్ట్ బ్లాక్ బస్టర్ పడింది. ఈ సినిమా సక్సెస్ లో రజనీ ఒక్కరే కీలకం కాదు. భారీ కాన్వాస్ పై తెరకెక్కిన చిత్రమిది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి టాప్ స్టార్లు గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వడంతోనే ఇది సాద్యమైంది.
ఇందులో ఒక్కొక్కరి ఎంట్రీనే థియేటర్లో విజిల్స్ వేయించింది. ఆ రేంజ్ లో పాత్రలు కనెక్ట్ అయ్యాయి. తాజాగా ఈసినిమా సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'కూలీ' షూటింగ్ అనంతరం రజనీకాంత్ 'జైలర్-2' చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు. అయితే సీక్వెల్ లో 'జైలర్' టీమ్ అంతా యధావిధిగా కొనసాగుతుందా? లేదా? అన్న సందేహం ఉంది. హీరోయిన్ సహా కొన్ని పాత్రల విషయంలో మార్పులుంటాయి. గెస్ట్ పాత్రల్ని కూడా మారే అవకాశం ఉంటుంది.
కొత్త నటీనటుల్ని తీసుకుంటే? సినిమాకి ప్రెష్ ఫీల్ వస్తుందనే కోణంలో ఈ రకమైన మార్పులు జరుగుతుంటాయి. అయితే మిగతా నటీనటుల సంగతి పక్కనబెడితే సీక్వెల్ లో మాత్రం మోహన్ లాల్, శివన్న, జాకీ ష్రాఫ్ యధావిధిగా గెస్ట్ రోల్స్ లో కంటున్యూ అవుతారని సమాచారం. ఆ పాత్రలతో పాటు కొత్తగా మరో ఇద్దరు స్టార్లను జోడిస్తారని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
విలన్ పాత్ర పోషించిన వినాయకన్ రోల్ మాత్రం అలాగే ఉంటుందిట. ఆ రోల్ ని సీక్వెల్ లో మరింత శక్తివంతంగా మలుస్తున్నారుట. ఆ పాత్రలో యధావిధిగా కామెడీ యాంగిల్ ని హైలైట్ చేస్తునే అవసరం మేర అంతే సీరియస్ నెస్ గాను స్క్రిప్ట్ లో మలిచినట్లు వినిపిస్తుంది. 'జైలర్' లో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఆ పాత్రని మాత్రం రీప్లేస్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.