వీడియో : బ్లాక్ బస్టర్‌ 'జైలర్‌' మళ్లీ ఇలా వస్తున్నాడు

రజనీకాంత్‌ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ ఆందోళన చెందే పరిస్థితి ఉండేది. ఒకటి రెండు సినిమాలు చూసి రజనీకాంత్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తారు అని చాలా మంది అనుకున్నారు

Update: 2025-01-14 13:47 GMT

రజనీకాంత్‌ కెరీర్ ఖతం అయ్యింది, ఆ సినిమాలు మానేస్తే బాగుంటుంది, ఆయన ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేయలేరు, ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలి అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. దాదాపు పదేళ్లు హిట్స్ లేకపోవడంతో పాటు, చేసిన ప్రతి సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో ఒకానొక సమయంలో సూపర్‌ స్టార్ ఫ్యాన్స్ సైతం నిరుత్సాహంకు గురి అయ్యారు. రజనీకాంత్‌ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ ఆందోళన చెందే పరిస్థితి ఉండేది. ఒకటి రెండు సినిమాలు చూసి రజనీకాంత్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తారు అని చాలా మంది అనుకున్నారు. అలాంటి సమయంలో వచ్చిన 'జైలర్‌' మూవీ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.

సూపర్‌ స్టార్‌ ఈజ్ బ్యాక్‌ అంటూ ప్రతి ఒక్కరితో అనిపించిన జైలర్‌ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకోవడంతో రజనీకాంత్‌ మరో పదేళ్ల పాటు వరుసగా సినిమాలు చేసే ఎనర్జీని తెచ్చి పెట్టింది. జైలర్‌ తర్వాత బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే వేట్టయాన్‌ సినిమాతో రజనీకాంత్‌ వచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ పరచింది. అయినా జైలర్ ఇచ్చిన బూస్ట్‌తో రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ కూలీ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఈ సమయంలోనే దర్శకుడు నెల్సన్‌ దిలీప్ నుంచి జైలర్‌ 2 అధికారిక ప్రకటన వచ్చింది.

జైలర్‌ 2 గురించి గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ సీక్వెల్‌ కోసం కథను రెడీ చేసేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. చివరకు గొప్ప కథను రూపొందించాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పొంగల్‌ సందర్భంగా జైలర్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను విడుదల చేశారు. ఒక టీజర్‌ నిమిషం లేదా రెండు నిమిషాలు ఉంటుంది. కానీ ఈ సినిమా టీజర్‌ ఏకంగా నాలుగు నిమిషాలు ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌లు ఈ వీడియోలో కనిపించారు. రజనీకాంత్‌ సాలిడ్‌ యాక్షన్‌తో వీడియోలో కనిపించారు.

ఏదో కథ ఎందుకు ఇదే కథతో సినిమాను తీస్తే బాగుంటుంది కదా అని దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌తో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్‌ అంటాడు. జైలర్‌ కథకు కొనసాగింపుగా జైలర్‌ 2 సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న జైలర్‌ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా జైలర్ 2 ఉంటుంది అంటూ రజనీకాంత్‌ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. జైలర్‌లో కథ ఎక్కడ అయితే ఆగిపోయిందో అక్కడ నుంచే సీక్వెల్‌ కథ మొదలు అవుతుంది. రజనీకాంత్‌ను మరోసారి కాస్త వయసు అయిన మాజీ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో చూడబోతున్నారు. ఈసారి మరో కేసు ఇన్వెస్టిగేషన్‌తో రజనీకాంత్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాదిలోనే జైలర్ 2 ఉండే అవకాశాలు ఉన్నాయి.

Full View
Tags:    

Similar News