మ‌హేష్ కోసం టైటానిక్ నే దించుతున్నారా?

ఆయ‌న వ‌చ్చిన సంద‌ర్భంగా ఏకంగా నేష‌న‌ల్ మీడియాని తీసుకొచ్చి భారీ మీడియా స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌

Update: 2024-02-27 07:15 GMT

# ఎస్ ఎస్ ఎంబీ 29 కోసం ఏకంగా టైటానిక్ నే దించుతున్నారా? ఇది పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అన‌డానికి మ‌రో సాక్ష్యం అనొచ్చా? అందుకు త‌గ్గ‌ట్టు రాజ‌మౌళి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడా? ఏకంగా నేష‌న‌ల్ మీడియా తోనే మీట్ నే ఏర్పాటు చేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయుడిగా రాజ‌మౌళి సినిమా కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు అవ‌స‌రం మేర వర్క్ షాప్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇవ‌న్నీ పూర్త‌యిన త‌ర్వాత అధికారంగా చిత్రాన్ని మంచి ముహూర్తానికి లాంచ్ చేయ‌నున్నారు. అయితే ఈ లాంచింగ్ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో నిలిచిపో యేలా ప్లాన్ చేస్తున్నారు? అన్న‌ది తాజాగా వినిపిస్తోన్న మాట‌. ప్రారంభోత్స‌వానికి ఏకంగా హాలీవుడ్ ద‌ర్శ‌క దిగ్గ‌జం జేమ్స్ కామెరూన్ ని తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. ఆయ‌న చేతుల మీదుగా సినిమా లాంచ్ చేసి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్లాల‌ని భావిస్తున్నారుట‌.

ఆయ‌న వ‌చ్చిన సంద‌ర్భంగా ఏకంగా నేష‌న‌ల్ మీడియాని తీసుకొచ్చి భారీ మీడియా స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. మ‌రి రాజమౌళి పిలిస్తే కామెరూన్ వ‌స్తాడా? అంటే ఎందుకు రాడు అన్న‌ది అంతే బ‌లంగా వినిపిస్తోన్న మాట‌. జేమ్స్ కామెరూన్ మొచ్చిన మొట్ట మొద‌టి ఇండియ‌న్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. 'ఆర్ ఆర్ ఆర్ 'సినిమా చూసిన త‌ర్వాత జేమ్స్ కెమెరూన్ ..జ‌క్క‌న్న‌ని ఏ రేంజ్ లో ప్ర‌శంసించాడో చెప్పాల్సి న ప‌నిలేదు.

'ఆర్ ఆర్ ఆర్' సినిమాని ప్ర‌శంశిస్తూ ఏకంగా ఓ వీడియోనే సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసారు. అది ప్ర‌పం చ వ్యాప్తంగా వైర‌ల్ అయింది. ప్ర‌పంచానికి తెలిసిన జ‌క్క‌న్న‌ని మ‌రోసారి కామెరూన్ రూపంలో ప‌రిచ‌యం చేసిన‌ట్లు అయింది. మ‌రి అంత‌టి లెజెండ‌రీ మేక‌ర్ ని తీసుకొస్తే మ‌హేష్ సినిమా ఇంర్నే ష‌న‌ల్ ప్రాజెక్ట్ అవుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే ఇది పాన్ ఇండియా సినిమానా? పాన్ వ‌ర‌ల్డ్ సినిమానా? అని డౌట్ ఉండేది. తాజా ప్ర‌చారంతో ఆ సందేహం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. మరి ఈ మొత్తం ప్రచారంలో నిజ‌మెంతో తెలియాలంటే రాజ‌మౌళి లైన్ లోకి రావాల్సిందే.

Tags:    

Similar News