అల్లు అర్జున్ - అట్లీ.. హీరోయిన్ ఎవరంటే?

ఈ క్రేజీ కాంబోలో హీరోయిన్ ఎవరనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2025-02-15 19:30 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో అతి పెద్ద ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1800 కోట్ల గ్రాస్ ను అందుకోవడంతో నేషనల్ వైడ్ గా క్రేజ్ పెరిగింది. తప్పకుండా నెక్స్ట్ రాబోయే సినిమాలు అంతకుమించి అనేలా ఉంటాయని చెప్పవచ్చు. అసలైతే నెక్స్ట్ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని మొదటి నుండి అనుకున్నా, స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది.

ఇదే సమయంలో, మరో క్రేజీ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ గత కొంతకాలంగా అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. ‘జవాన్’తో బాలీవుడ్‌లోనూ తన మార్క్ చూపించిన అతను, ఇప్పుడు స్ట్రైట్ తెలుగు మూవీ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ కాంబినేషన్ చాలా కాలంగా చర్చల్లోనే ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం అన్ని క్లారిటీ వచ్చిందని, అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని టాక్.

ఈ క్రేజీ కాంబోలో హీరోయిన్ ఎవరనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బ్యూట్ జాన్వీ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మొదట పుష్ప 2 లో ఐటెమ్ సాంగ్ కోసం జాన్వీ కపూర్ పేరును పరిశీలించినప్పటికీ, ఆమె హీరోయిన్‌గా చేయాలనే ఉద్దేశంతో ఆ అవకాశం వదులుకుంది. అయితే ఇప్పుడు ఆమెకి బిగ్ డీల్ దక్కినట్లు సమాచారం.

పుష్ప 2 లో ఐటెమ్ సాంగ్ చేసుంటే, ఈ అవకాశం కాస్త ఆలస్యం అయ్యేదేమో అనే అభిప్రాయంతో జాన్వీ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు తను చేసిన అన్ని సినిమాల్లో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తనదైన మార్క్ చూపించిన అట్లీ, అల్లు అర్జున్‌తో సరికొత్త మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. గతంలో అట్లీ ‘జవాన్’ కోసం పని చేసిన టెక్నీషియన్స్ లో చాలామంది ఇప్పుడు ఈ సినిమాకు పని చేసే అవకాశాలు ఉన్నాయట.

అలాగే ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం కథపై చర్చలు జరుపుతున్నారని టాక్. ఇంకొన్ని మార్పులు అవసరం అని తెలుస్తోంది. ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసే అవకాశం ఉంది. మరోవైపు త్రివిక్రమ్ స్క్రిప్ట్ మీద ఇంకా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అట్లీ సినిమా ముందుగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News