హీరోతో లిప్ లాక్‌ల‌లో జాన్వీ వేరే లెవ‌ల్

ఇప్పుడు జాన్వీ తన కొత్త చిత్రం `స‌న్నీ సంస్కారి కి తులసి కుమారి` షూటింగ్‌లో బిజీగా ఉంది.

Update: 2024-09-30 04:52 GMT

బోల్డ్ పాత్ర‌లో గ్లామ‌ర్ షో చేయ‌డం వేరు.. ఘాటైన స‌న్నివేశాల్లో లిప్ లాక్ లు, బెడ్ రూమ్ రొమాన్స్ లో చెల‌రేగిపోవ‌డం వేరు. ఈ రెండో కేటగిరీలో కొంద‌రు న‌టీమ‌ణుల‌కు మాత్ర‌మే అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు జాన్వీ క‌పూర్ కి కూడా అలాంటి ఒక రొమాంటిక్ మూవీలో బోల్డ్ పాత్ర‌లో అవకాశం ద‌క్కింద‌ట‌. ప్ర‌ముఖ యువ‌హీరోతో జాన్వీ పెద‌వి ముద్దుల్లో చెల‌రేగిపోయింద‌ని సెట్స్ నుంచి లీకులు అందాయి. మ‌రింత‌గా వివ‌రాల్లోకి వెళితే..

జాన్వీ కపూర్ ఇటీవ‌ల పాన్ ఇండియా మూవీ `దేవ‌ర‌`లో క‌నిపించిన సంగతి తెలిసిందే. ఆరంగేట్ర‌మే ఎన్టీఆర్ తో పాన్ ఇండియా హిట్టు కొట్టిన అదృష్ట‌వంతురాలు అయింది. దేవరలో రెండు సన్నివేశాలు, ఒక పాటలో మాత్రమే త‌న‌కు ప్ర‌ద‌ర్శ‌న‌కు ఆస్కారం ఉన్నప్పటికీ తనదైన‌ గ్లామర్ షోతో హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది. దేవ‌ర ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా 300కోట్ల వ‌సూళ్ల దిశ‌గా సాగుతోంద‌ని ట్రేడ్ చెబుతోంది.

ఇప్పుడు జాన్వీ తన కొత్త చిత్రం `స‌న్నీ సంస్కారి కి తులసి కుమారి` షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇందులో హిందీ హీరో వరుణ్ ధావన్ తో రొమాన్స్ చేయ‌బోతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో జాన్వీ చాలా బోల్డ్ సీన్స్ చేసిందని సమాచారం. జాన్వీ మ‌తి పోగొట్టే అవతార్‌లో కనిపిస్తుంది. హిందీ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ధావ‌న్‌తో కొన్ని లిప్ లాక్ సీన్స్ కోసం చెల‌రేగిపోయింద‌ని గుస‌గుస వినిపిస్తంది. దేవ‌ర త‌న కెరీర్ కి కీల‌క మ‌లుపునిచ్చింది. త‌న కెరీర్ లో తొలి పాన్ ఇండియా హిట్ అందుకున్న జోష్ లో ఉంది. ఇదే హుషారులో రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమాలోను న‌టించేందుకు రెడీ అవుతోంది. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించే క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోందని స‌మాచారం.

Tags:    

Similar News