అభిమానులకు కపూర్ బ్యూటీ జాన్వీ పాప!
బాలీవుడ్ లో శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ కెరీర్ సక్సెస్ పుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ లో శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ కెరీర్ సక్సెస్ పుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో ల నుంచి సీనియర్ హీరోల వరకూ అందరి తోనూ కలిసి పనిచేస్తోంది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. సరిగ్గా ఇదే సమయంలో `దేవర` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. తొలి సినిమానే ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది.
ఆ రకంగా నటనతో పాటు, డాన్సుల్లో కూడా తారక్ ధీటుగా పని చేయాల్సిన పరిస్థితి. ఈనెల 27న `దేవర` భారీ అంచనాల మధ్య రిలీజ్ వుతుంది. అయితే నిన్నటి రోజున జరగాల్సిన ప్రీ రిలీజ్ వేడుక రద్దయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జాన్వీ ఓ వీడియో పోస్ట్ చేసిందీ. `అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ఇంత ప్రేమని చూపించిన తెలుగు ఆడియెన్స్ అలానే నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు.
మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీలవడం నాకెంతో ఆనందంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో తెలుసు. అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలానే నాకు కూడా’ అంది. అలాగే `నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్ట పడతాను. శివ సర్, ఎన్టీఆర్ సర్ ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకోవడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంద నుకుంటున్నాను.
నాకు చాలా సహాయపడిన చిత్ర బృందానికి థ్యాంక్స్` అని చెప్పుకొచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో జాన్వీ తెలుగు ఎంతో చక్కాగా మాట్లాడింది. ముంబైలో పుట్టి పెరిగిన జాన్వీ తొలి సినిమా ముగింపుకే తెలుగు నేర్చుకునే ప్రయత్నం ప్రశంసనీయం. అలాగే జాన్వీ లంగావోణీలో ఎంతో అందంగా ముస్తాబై ఈ వీడియో రిలీజ్ చేసింది. చెవులకు బుట్టలు..నుదిటిన చిన్న బొట్టు దరించి నవ్వుతూ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అచ్చమైన తెలుగు అమ్మాయినే తలపించింది. ఆ పిక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.