తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి!
సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎంత వైభవంగా జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది రూపాలయ ఖర్చుతో భారీ హంగులు.. ఆర్బాటాలతో వివాహాలు జరుగుతుంటాయి
సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎంత వైభవంగా జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది రూపాలయ ఖర్చుతో భారీ హంగులు.. ఆర్బాటాలతో వివాహాలు జరుగుతుంటాయి. స్థానికంగా పెళ్లి చేసుకుంటే ఆ మూడు రోజుల వేడుకతో ముంబై సిటీ మెరిసిపోతుంది. భారీ ఎత్తున సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు అంతా పాల్గొంటలారు. ఆ మూడు రోజులు సోషల్ మీడియా కూడా హోరెత్తిపోతుంది.
అదే డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే ఈ హడావుడి అంతా ఉండదు. విదేశాల్లోనో...రాజాస్తాన్ లోనే ప్లాన్ చేసుకుని సింపుల్ గా కానచ్చిస్తుంటారు. ఆ తర్వాత ముంబై, హైదరాబాద్ లో రిసెప్షన్లు ఏర్పాటు చేస్తుంటారు. అయినా ఖర్చు ఎక్కడా తగ్గదు. అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. మరి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ పెళ్లి ఈ రెండు పద్దతుల్లో ఎలా జరుగుతుంది? అంటే అందుకు ఛాన్సేలేదని తెలుస్తోంది.
ఎందుకంటే జాన్వీ కపూర్ పెళ్లి ముంబై..హైదరాబాద్ లో కాకుండా తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా జరుగుతుంది. అవును ఈ విషయాన్ని జాన్వీ స్వయంగా రివీల్ చేసింది. తాను పెళ్లి చేసుకుంటే మాత్రం కచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏడు కొండల స్వామి సాక్షిగానే కొండపైనే పెళ్లి చేసుకుంటానంది. అలాగే భర్త, పిల్లలతో జీవితాన్ని తిరుపతి కొండమీదే గడపాలనుకుంటున్నట్లు కూడా తెలిపింది.
ఇక్కడ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని...ఇక్కడ ఉన్నంత సేపు ఎలాంటి బాధ బంధీలు గుర్తుకు రావని తెలిపింది. మొత్తానికి పెళ్లి విషయంలో జాన్వీ మాత్రం ఓ గొప్ప నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. శ్రీవారి చెంత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెళ్లి జరిగితే ఆ జీవితం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. శ్రీదేవి-బోనీకపూర్ దంపతులు ఏడాదిలో నాలుగైదు సార్లైనా కుటుంబంతో శ్రీవారిని దర్శించుకోవడం ఓ అనవాయితీ. ఇప్పుడు ఆనవాయితీని జాన్వీ కపూర్ కొనసాగిస్తుంది.