జాన్వీని సరిగ్గా వాడుకున్న దేవర!

దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జాన్వీనే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఏ హిందీ సినిమాతోనూ రాని అటెన్షన్ ఈ ఒక్క సాంగ్ తో వచ్చింది.

Update: 2024-08-06 16:53 GMT

 

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత అనేక మంది బాలీవుడ్ యాక్టర్స్ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. అలానే టాలీవుడ్ డైరెక్టర్స్ బీటౌన్ కి వెళ్లి హిందీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మన ఫిలిం మేకర్స్ అక్కడి స్టార్స్ ను విభిన్నమైన పాత్రల్లో సరికొత్తగా చూపిస్తున్నారు. వారిలోని మరో కోణాన్ని ఆవిష్కరించడంలో సక్సెస్ అవుతున్నారు. తమ స్టార్స్ ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో బాలీవుడ్ దర్శకులకు చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కొరటాల శివ సైతం జాన్వీ కపూర్ ను అద్భుతంగా ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది.

 

'దేవర' సినిమాతో దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తోంది. ఆమె తంగం అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ లో ఆకట్టుకోగా.. లేటెస్టుగా వచ్చిన 'చుట్టమల్లే' పాటతో అందరినీ మెస్మరైజ్ చేసింది. స్క్రీన్ మీద అమ్మడు ఎంతో అందంగా కనిపించడమే కాదు, రొమాంటిక్ సాంగ్ లో తారక్ తో కలిసి అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకుంది. పాటకు తగ్గట్టుగా సింపుల్ స్టెప్పులతో అలరించింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జాన్వీనే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఏ హిందీ సినిమాతోనూ రాని అటెన్షన్ ఈ ఒక్క సాంగ్ తో వచ్చింది.

 

జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లు దాటిపోయింది. 2018 సంవత్సరంలో 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. అర డజనుకు పైగా హిందీ చిత్రాల్లో నటించింది. వాటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసాయి కానీ, సరైన కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. ఏవీ కూడా జాన్వీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి ఉపయోగపడలేదు. రీసెంట్ గా వచ్చిన 'ఉలాజ్‌' మూవీ కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది.

 

నిజాయతీగా మాట్లాడుకుంటే నటన పరంగా జాన్వీ కపూర్ తన తల్లి మాదిరిగా అద్భుతమైన నటి కాదు. కానీ అతిలోక సుందరి అందాన్ని పుణికిపుచ్చుకుంది. గ్లామర్ తో పాటుగా మంచి డ్యాన్సింగ్ స్కిల్స్ కలిగి ఉంది. కాబట్టి దర్శకులు ఆమె టాలెంట్ ను ఇతర మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. ఆమె అందచందాలను ఇంకా అందంగా తెర మీద ఆవిష్కరించవచ్చు. కానీ బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు కొరటాల శివ 'దేవర' సినిమాతో మొట్టమొదటిసారిగా జాన్వీని గ్లామర్ క్వీన్ గా, హాట్ బ్యూటీగా చూపించి సినీ అభిమానులను ఆకట్టుకున్నారు.

జాన్వీ ఆఫ్-స్క్రీన్ లో ఎంత గ్లామరస్ గా ఉంటుందో సోషల్ మీడియాని ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది. కానీ ఆన్-స్క్రీన్ లో ఆమె ఎక్కువగా డల్ గా సుబ్టిల్ గా ఉండే పాత్రల్లోనే కనిపించింది. కొరటాల మాత్రం ఆమె బలాలు స్కిల్స్ తెలుసుకొని, వాటిని 'దేవర' చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారు. కొన్ని షాట్స్ లో దివంగత శ్రీదేవిని గుర్తుకు వచ్చేలా చేసారు. ఇన్నాళ్లూ ఈ జాన్వీ ఎక్కడికిపోయింది అని ఆశ్చర్యపోయేలా చేసారు. ఎన్టీఆర్ పక్కన జాన్వీ ఎలా కనిపిస్తుందో అని సందేహాలు వ్యక్తం చేసిన వారందరికీ, ఒక్క సాంగ్ తో సమాధానం చెప్పారు. మరి టాలీవుడ్ డైరెక్టర్లను చూసైనా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆమె నైపుణ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటారేమో చూడాలి.

Tags:    

Similar News