సూర్య స‌ర‌స‌న జన్వీ క‌పూర్

2-భాగాల ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తెర‌కెక్కించ‌నున్నారు.

Update: 2024-01-29 02:45 GMT

తమిళ స్టార్ హీరో సూర్య న‌టిస్తున్న `కంగువ` పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత సూర్య న‌టించే మ‌రో పాన్ ఇండియా చిత్రం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇది క‌ర్ణుడి క‌థ ఆధారంగా రూపొంద‌నుంది. కర్ణతో సూర్య‌ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. 2-భాగాల ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తెర‌కెక్కించ‌నున్నారు. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ క‌ర్న‌కు సంబంధించిన తాజా అప్ డేట్ ఆస‌క్తిని పెంచుతోంది.

కర్ణుడిగా సూర్య న‌టిస్తుండ‌గా, అత‌డి స‌ర‌స‌న క‌థానాయిక ఎవ‌రు? అంటూ చ‌ర్చ సాగుతోంది. తాజా క‌థ‌నాల ప్ర‌కారం..యువ నటి జాన్వీ కపూర్‌ను క‌థానాయిక పాత్ర‌ కోసం `కర్ణ` మేకర్స్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మెగా బడ్జెట్ డ్రామాలో జాన్వీ ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తుందో ఇంకా క్లారిటీ లేదు. టాలీవుడ్ లో దేవ‌ర‌లో న‌టిస్తున్న ఈ భామ‌కు ఇంత‌లోనే సూర్య లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్క‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

టైటిల్ ప్ర‌కారం.. కర్ణుడు మహాభారతంలోని ఐకానిక్ కర్ణ పాత్ర ఆధారంగా రూపొందుతోంది. సూరరై పొట్రు దర్శకురాలు సుధా కొంగరతో ఓ సినిమా చేయాల్సి ఉండ‌గా, త‌దుప‌రి ద‌రువుశివ‌తో కంగువను వేగంగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అటుపై క‌ర్ణ‌ ఎపిక్ ఫ్రాంచైజీ మొదటి భాగం ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రారంభమవుతుంది. కర్ణ 2025లో భారీ స్థాయిలో పాన్-ఇండియన్ కేట‌గిరీలో విడుదల కానుంది.


Tags:    

Similar News