అత‌డితో జాన్వీక‌పూర్ ప్రేమాయ‌ణం అందుకేనా?

జాన్వీక‌పూర్ -శిఖ‌ర్ ప‌హారియా కొంత కాలంగా సీరియ‌స్ గా ల‌వ్ లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-01-04 10:14 GMT

జాన్వీక‌పూర్ -శిఖ‌ర్ ప‌హారియా కొంత కాలంగా సీరియ‌స్ గా ల‌వ్ లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టు జంట‌గా చిక్కిన సంద‌ర్భాలెన్నో. క‌లిసి ప‌బ్ ల‌కు వెళ్ల‌డం ద‌గ్గ‌ర నుంచి గుళ్లు గోపురాలు చుట్టేయ‌డం వ‌ర‌కూ ఈ జోడీ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. కానీ ఇంత‌వ‌ర‌కూ ఈ వ్య‌వ‌హారమంతా ఎక్క‌డా అధికారికం కాలేదు. అటు జాన్వీ గానీ.. ఇటు శిఖ‌ర్ గానీ ఎక్క‌డా స్పందించలేదు. ఆ టాపిక్ కూడా ఇంత‌వ‌ర‌కూ వాళ్లిద్ద‌రి దృష్టికి అంత సీరియ‌స్ గానూ వెళ్లిన‌ట్లు లేదు. ఇటీవ‌లే క‌ర‌ణ్ జోహార్ టాక్ షోలో జాన్వీ స్పీడ్ డ‌య‌ల్ శిఖ‌ర్ నెంబ‌ర్ ఉంటుంద‌ని అధికారికంగా ఒప్పుకుంది.

కుషీ క‌పూర్....బోనీ క‌పూర్ తో పాటు అత‌డి నెంబ‌ర్ కూడా ఉంటుంద‌ని తెలిపింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఇంత వ‌ర‌కూ జ‌రుగుతోంది కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మే కాద‌ని అంత‌కు మించి రిలేష‌న్ ఏదో న‌డుస్తోంది అన్న సంగ‌తి మ‌రోసారి క్లారిటీ వ‌చ్చింది. తాజాగా జాన్వీ మాట‌ల్ని బ‌ట్టి ఇద్ద‌రి మ‌ధ్య వ్య‌వ‌హారం చాలా దూరం వెళ్లింద‌ని...ఇదంతా అంద‌రికీ తెలిసే జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. శిఖ‌ర్ ప‌హారియాతో త‌న కంప‌ర్ట్ లెవ‌ల్స్ ఎలా ఉంటాయి? అన్న‌ది తాజాగా మ‌రోసారి అదే టాక్ షోలో రివీల్ చేసింది జాన్వీ. శిఖ‌ర్ తో డేటింగ్ లో వాస్త‌వం ఎంత అన్న ప్ర‌శ్న‌కు నిజం అని డైరెక్ట్ గా చెప్ప‌కుండానే ఇష్టం అనే స‌మాధానం ఇచ్చిన‌ట్లు అయింది. శిఖ‌ర్ గురించి ఎంతో ప్ర‌త్యేకంగా చెప్పుకొచ్చింది.

అత‌డు త‌న తండ్రి బోనీ క‌పూర్ కి..చెల్లెలు ఖుషీ క‌పూర్ తో సైతం స్నేహితుడిలా ఉంటాడంది. నిస్వార్థంగా.. గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అని.. తనలాంటి వ్యక్తిత్వం ఉన్న మగవారిని ఇంత‌వ‌ర‌కూ త‌న‌కెవ‌రు తార‌స‌ప‌డ‌లేదంది. న‌టుల‌తో డేటింగ్ ఎందుకు ఇష్ట‌ప‌డ‌దో ఇదే సంద‌ర్భంగా తెలిపింది జాన్వీ. న‌ట‌న అంటే పూర్తిగా అక్క‌డే బాండ్ అయి ప‌నిచేయాలి. కానీ న‌న్ను ఇష్ట‌ప‌డే వ్య‌క్తి నా ప‌ట్ల ఆస‌క్తితో పాటు..ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ద చూపించాలి. నాకోసం అంటూ కొంత స్పేస్ ఇవ్వాలి. ఇవ‌న్నీ నేను క‌చ్చితంగా కోరుకుంటాను.

న‌టీనటుల విష‌యంలో అది కుద‌ర‌ద‌ని నా అభిప్రాయం. వాళ్లెప్పుడు ర‌క‌ర‌కాల ప‌నుల‌తో బిజీగా ఉంటారు. వాళ్ల టెన్ష‌న్ లైఫ్ ఎలా ఉంటుదో ఓ న‌టిగా నాకు తెలుసు. అలాంటి ఎమోష‌న్స్ ని నేను బ్యాలెన్స్ చేయ‌లేను. ఒకే వృత్తిలో ఉన్న‌వారితో డేటింగ్ క‌ష్ట‌మైన ప‌ని అని...వేర్వేరు వృత్తుల‌తో కంప‌ర్ట్ దొరుకుతుంద‌ని` అంది. జాన్వీ మాట‌ల్ని శిఖ‌ర్ తో డేటింగ్ వ్య‌వ‌హార‌మంతా నిజ‌మేన‌ని తెలుస్తోంది. ఎందుకంటే శిఖ‌ర్ ప‌హారియా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తి కాదు. అత‌నొక ప్రొపెష‌న‌ల్ బిజినెస్ మ్యాన్. ముంబైకి చెందిన వ్యాపారవేత్తలు సంజయ్ పహారియా మరియు స్మ్రుతి షిండే దంపతులకు జన్మించారు. శిఖర్ తాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News