అల్లు అర్జున్ మెగా బ్రదర్స్ కాళ్ళు మొక్కలి - జనసేన లీడర్

ఇదిలా ఉంటే తాజాగా మరో జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ అల్లు అర్జున్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Update: 2024-08-29 05:49 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం తిరుగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత వివిధ రకాల అభిప్రాయాలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో చాలా కాలంగా అల్లు అర్జున్ వెర్సస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్లు వివాదం సాగుతోంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రీరిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నచ్చితే వస్తా… ఎంత వరకైనా వస్తా అంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అల్లు అర్జున్ చేశాడంటూ సోషల్ మీడియాలో మరల వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ మీద, మెగా ఫ్యామిలీ మీద అతను చేసిన విమర్శలకి కౌంటర్ గా నేను మాట్లాడానని బొలిశెట్టి చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ అల్లు అర్జున్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అతన్ని ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా అందరూ అభిమానిస్తారు. మెగా ఫ్యామిలీ అండదండలతో వచ్చి అల్లు అర్జున్ సంస్కారహీనుడిగా మారిపోయాడు. మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారిని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ అభిమానులుగా తయారయ్యాము.

అయితే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజు వారినే విమర్శస్తున్నారు. అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలకి బహిరంగంగా క్షమాపణ చెప్పి మెగా బ్రదర్స్ కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకోవాలి. లేదంటే మా నియోజకవర్గంలో డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2 సినిమాని రిలీజ్ చేయనివ్వం. గన్నవరం నియోజకవర్గం మొత్తంలో నీ సినిమాని అడ్డుకుంటాం. ఒక్క ఫ్లెక్సీ కూడా ఎవ్వరు పెట్టరు. నీ సినిమా రిలీజ్ అయ్యేలోపు తప్పుని ఒప్పుకొని చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కళ్ళు కడిగి క్షమాపణ కోరాలి.

అలాగే నీ ఆలోచనని మార్చుకోవాలి. ఇప్పటికే క్షమించరాని తప్పు చేసావ్. దీనిని ఎట్టి పరిస్థితిలో కూడా సహించం అంటూ చలమలశెట్టి రమేష్ అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే వీటికి కౌంటర్ గా అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. అలాగే వైసీపీ నాయకులు బన్నీకి సపోర్ట్ గా మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ మీద విమర్శల దాడి చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారానికి అల్లు, మెగా ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా ఫుల్ స్టాప్ పెడతారా లేదంటే సైలెంట్ గా వేచి చూసే ధోరణిలో ఉంటారా అనేది చూడాలి.

Tags:    

Similar News