సూపర్‌స్టార్ టైటిల్‌ని ఎగతాళి చేసిన దిగ్గజ నటి
'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ'ను ఎగతాళి చేస్తూ ఇదేమి టైటిల్? ఇలాంటి సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించారు.;
'ఖిలాడీ' అక్షయ్ కుమార్ నటించిన 7 సినిమాలు వరుసగా ఫ్లాపులయ్యాయి. పరిశ్రమ అగ్రహీరోకి ఇది ఊహించనిది. పరాజయాలను మించి అక్షయ్‌పై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అయితే అతడిపై విమర్శల ఝడివాన ఇప్పట్లో ఆగేట్టు లేదు. ఇటీవల ఇండియా టీవీతో చాటింగ్ సెషన్‌లో ప్రముఖ నటి జయా బచ్చన్ అక్షయ్ సినిమా టైటిల్‌ని ఎగతాళి చేసారు.
'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ'ను ఎగతాళి చేస్తూ ఇదేమి టైటిల్? ఇలాంటి సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించారు. ఈ చిత్రం 2017లో విడుదలైంది. ఇందులో అక్షయ్ కుమార్ - భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. జయాజీ మాట్లాడుతూ-''సినిమా టైటిల్ చూడండి. నేను అలాంటి పేరుతో సినిమా చూడటానికి ఎప్పటికీ వెళ్ళను. యే కోయి నామ్ హై? అది నిజంగా పేరేనా?'' అని జయా బచ్చన్ అన్నారు. అలాంటి టైటిల్ ఉన్న సినిమా చూడటం మీకు ఇష్టమా? అని సీనియర్ నటి ప్రేక్షకులను అడిగారు. కొందరు చేతులు పైకెత్తినప్పుడు ఆమె ఇలా చెప్పారు. ''చాలా మందిలో, నలుగురు కూడా సినిమా చూడాలని అనుకోరు. ఇది చాలా విచారకరం.. ఇది ఒక ఫ్లాప్'' అని అన్నారు.
ఒక సీనియర్ నటి, పరిశ్రమ ప్రముఖుడి భార్య అక్షయ్ సినిమాని ఇలా విమర్శించడం నిజంగా ఆశ్చర్యపరిచింది. టాయ్ లెట్- ఏక్ ప్రేమకథ కాన్సెప్ట్ బావున్నా జనం థియేటర్లకు రాకపోవడంతో యావరేజ్ గా ఆడింది. అక్షయ్ కుమార్ -వీర్ పహరియా ప్రధాన పాత్రలలో నటించిన 'స్కై ఫోర్స్' ఫలితం కూడా ఇంచుమించు ఇలానే ఉంది. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆ బ్యానర్ కి ఆశించిన ఫలితాన్ని తేలేదు.
అక్షయ్ కుమార్ తదుపరి టాలీవుడ్ సినిమా 'కన్నప్ప'లో కనిపిస్తారు. ఈ చిత్రం శివుడిపై అచంచలమైన భక్తికి పేరుగాంచిన శైవ సాధువు కన్నప్ప నాయనార్ జీవితం ఆధారంగా రూపొందింది. ఎం. మోహన్ బాబు- విష్ణు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం భారీ వీఎఫ్ఎక్స్ ని ఉపయోగించారు. 100 కోట్ల బడ్జెట్ మించిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు అన్నారు.