విడాకుల్లో వేగం వాళ్లనే మించిపోయేలా!
ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీలో అందులోనూ కోలీవుడ్ మరింత దూకుడుగా కనిపిస్తుంది.
ఒకప్పుడు విడాకుల వార్తలంటే బాలీవుడ్ హైలైట్ అయ్యేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ ని మంచి దక్షిణాది చిత్ర పరిశ్రమ హైలైట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీలో అందులోనూ కోలీవుడ్ మరింత దూకుడుగా కనిపిస్తుంది. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే..' జయం రవి నిన్నటి రోజున భార్య ఆర్తితో విడిపో తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిందే. 14 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ జీర్ణించుకోలేని విషయాన్ని చెప్పాడు.
అయితే తనకు తెలియకుండానే ఈ ప్రకటన వచ్చిందని...తాను ఇంకా ఆలోచనలో ఉన్నానని భార్య ఆర్తి చెప్పడం షాకింగ్ గా మారింది. తన అనుమతి లేకుండానే ప్రకటన వచ్చిందని ఆమె వెర్షన్. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ధనుష్-ఐశ్వర్యా రజనీకాంత్ కూడా ఇలా ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారు కొంత కాలం పాటు వేర్వేరుగా ఉన్నారు. ఈ క్రమంలో పెద్దల పంచాయతీ కూడా నడిచింది. కానీ మళ్లీ కలవడం జరిగేది కాదని ఇరువురు భావించి 18 ఏళ్ల బంధాన్ని దూరం చేసుకున్నారు.
యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం పిల్లలు తల్లి వద్దనే ఉంటున్నారు. ఇదే ఏడాది మేలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సైంధవితో విడాకులు తీసుకున్న నటుడు కం మ్యూజిక్ డైరెక్టర్ జీ.వి ప్రకాష్. 11 ఏళ్ల బంధంలో మనస్పర్దలు చోటు చేసుకోవడంతో విడాకులతో వేరయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోతున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్ నుంచి నాగచైతన్య-సమంత కూడా విడిపోయిన సంగతి తెలిసిందే.
వివాహమైన నాలుగేళ్ల అనంతరం మనస్పర్దలు కారణంగా విడాకులతో వేరయ్యారు. ఇటీవలే నాగచైతన్య రెండవ వివాహం కూడా చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. నటి శోభితతో ఇటీవల ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే. వీటన్నింటి కంటే ముందు ప్రభుదేవా -రమ్లత్ కూడా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. రమ్లత్ తో విడిపోవడానికి ముందే ప్రభుదేవా నయనతార తో సహజీ వనం అంశం అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే. నయనతారతో వ్యవహారం పెళ్లి పీఠల వరకూ వెళ్లింది. కానీ ప్రేమతో సరి పెట్టారు