జై బాలయ్య... జయసుధ న్యూ ఎనర్జీ!
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో మాత్రం దర్శకుడు మహేష్ జయసుధ పాత్రని కాస్తా కొత్తగా డిజైన్ చేశారు.
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి లీడ్ రోల్ లో తెరకెక్కిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో జవాన్ వేవ్ లో కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తోంది. వీకెండ్ లో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే మూవీ మొత్తాన్ని నవీన్ పొలిశెట్టి చాలా స్ట్రాంగ్ గా నడిపించాడనే మాట వినిపిస్తోంది. పెర్ఫార్మెన్స్ పరంగా అనుష్కని కూడా డామినేట్ చేసేశాడని ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన. ఈ మూవీలో అనుష్క తల్లి పాత్రలో సీనియర్ యాక్టర్ జయసుధ నటించారు. ఇప్పటివరకు ఆమెని ఒక ట్రెడిషనల్ మదర్ క్యారెక్టర్ లోనే దర్శకులు రిప్రజెంట్ చేస్తూ వచ్చారు.
అయితే జయసుధలో కూడా కామెడీ టైమింగ్ ఉందనే విషయాన్ని కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. ఆమె కెరియర్ లో కొన్ని కామిక్ పాత్రలు చేశారు. అయితే తల్లిపాత్రలలోకి షిఫ్ట్ అయిన తర్వాత ఆ తరహా పాత్రలు చేయడం పూర్తిగా తగ్గిపోయింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో మాత్రం దర్శకుడు మహేష్ జయసుధ పాత్రని కాస్తా కొత్తగా డిజైన్ చేశారు.
సినిమాలో ఆమె యూకేలో ఉంటుంది. అలాగే బాలయ్యబాబుకి వీరాభిమానిగా ఆమె పాత్రని తీర్చిదిద్దారు. ఫ్రెండ్స్ తో కలిసి బాలయ్య సినిమా శ్రీమన్నారాయణ చూస్తూ అందులో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే డైలాగ్ ని ఇంగ్లీష్ కొత్తగా మార్చి చెప్పి ఫన్ క్రియేట్ చేస్తుంది. అలాగే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ని ఇంగ్లీష్ లో చెప్పడం ద్వారా జయసుధతో వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారు.
సినిమాలో ఈ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయినట్లు తెలుస్తోంది. జయసుధని అలా బాలయ్య అభిమానిగా చూడటంతో పాటు అతని డైలాగ్స్ ని ఇంగ్లీష్ లో చెప్పి హాస్యరసాన్ని కూడా పండించారు. సినిమాకి అదనపు అస్సెట్ గా ఇది మారిందనే మాట వినిపిస్తోంది.