ఆ ఐదుగురు హీరోలు ఒక వైపు.. చిరంజీవి మరో వైపు!
జయసుధ మాట్లాడుతూ-"ఇది కథ కాదు, ప్రాణం ఖరీదు సహా మరో రెండు సినిమాలకు చిరంజీవి గారితో కలిసి పని చేసాను. ఠఫ్ జర్నీ చిరంజీవి గారిది.. చాలా ఠఫ్.. అప్పటికే పెద్ద హీరోలు నలుగురైదుగురు ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబం గురించి సహజనటి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆయనతో సినిమాలు చేసేప్పుడు దగ్గరగా చూసిన విషయాలను చెప్పారు. ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవిపై మరింత గౌరవం భక్తిని పెంచడం ఖాయం.
జయసుధ మాట్లాడుతూ-"ఇది కథ కాదు, ప్రాణం ఖరీదు సహా మరో రెండు సినిమాలకు చిరంజీవి గారితో కలిసి పని చేసాను. ఠఫ్ జర్నీ చిరంజీవి గారిది.. చాలా ఠఫ్.. అప్పటికే పెద్ద హీరోలు నలుగురైదుగురు ఉన్నారు. కొత్తగా ఒకరు వచ్చి ఎదగాలనే ప్రయత్నం. ఫైవ్ వర్సెస్ వన్.. వారంతా ఒక వైపు.. చిరు ఒక వైపు..! అయితే కొత్తవాళ్లు ఎదగడం సులువు కాదు. కానీ మేమంతా కొత్త వాళ్లుగానే వచ్చాం గనుక అర్థం చేసుకున్నాం..." అని అన్నారు.
జయసుధ చిట్ చాట్ సారాంశం ఇదీ:
*ఇక క్రమశిక్షణ విషయానికి వస్తే.. ఒక రోజులో లేదా ఒక వారంలో సమయపాలన పాటించడమే కాదు.. దైవ భక్తి ఉన్న హీరో. ఏ సమయంలో ఏం చేయాలో పీరియడ్ వైజ్ విభజించి చాలా పాటించారు చిరు. ఇక చిరంజీవి గారి కుటుంబంలో అందరూ క్రమశిక్షణతో ఉంటారు. అలాగే వారంతా పెద్ద వాళ్లతో ఎలా మాట్లాడాలి. ఎలా గౌరవించాలి? అనే విషయంలో చిరంజీవి నుంచే నేర్చుకుంటారు. అలాగే మెగాస్టార్ కుటుంబం నుంచి స్టార్ అనే హడావుడి అస్సలు ఉండదు. ఇప్పుడున్న ఎన్టీఆర్, మహేష్ సహా అందరూ క్రమశిక్షణ కలిగిన వారు.
*మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమట్లె చెట్టు సహా మరో సినిమాలో చేసాను. కృష్ణ లాగా సైలెంట్. నన్ను జయసుధ అని పిలుస్తారు మహేష్. నేను మహేష్ అని పిలుస్తాను. నన్ను ఆంటీ అని ఎవరూ పిలవరు. కానీ చరణ్ ఆంటీ అని పిలుస్తారు. నాకు అంతవరకూ గుర్తు.
*నాకు ఎయిటీస్ స్టార్స్ అంతా స్నేహితులే. కానీ వ్యక్తిగతంగా రాధిక క్లోజ్. జయప్రద మంచి సన్నిహితురాలు. జయప్రద నా పెళ్లికి వచ్చింది. నితిన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అలాగే శ్రీప్రియ కూడా చాలా సన్నిహితురాలు..
*సాగర సంగమం అవకాశం తొలిగా నాకే వచ్చింది. అడ్వాన్స్ తీసుకుని మరీ చేయలేకపోయాను. అయితే అప్పటికే నాకు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఎన్టీ రామారావుగారితో సినిమా చేస్తున్నాను. దానిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే సాగర సంగమం చేయలేకపోయాను. నాకు అప్పట్లో గొప్ప సినిమాల్లో అవకాశాలున్నాయి. అప్పటికే సెటిల్డ్ హీరోయిన్ ని. అయితే విశ్వనాథ్ గారి చిత్రంలో సాగర సంగమం ఆఫర్ గొప్పది. కానీ వదులుకున్నా. మిగతా అన్నీ కమర్షియల్ సినిమాలే విశ్వనాథ్ గారితో చేసాను. అవన్నీ ఆయన స్టైల్ లో తెరకెక్కినవి కావు.. అని జయసుధ తెలిపారు.