కలెక్షన్లు చూసి మాట్లాడండి మేడం అంటూ కౌంటర్ ఎటాక్!
ఈ నేపథ్యంలో తాజాగా జయాబచ్చన్ వ్యాఖ్యలపై ఆ చిత్ర నిర్మాత ప్రేరణా అరోరా మండిపడ్డారు.;
ఇటీవలే 'టాయిలెట్ ఏక్ ప్రేమ కథ' టైటిల్ పై జయాబచ్చన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ టైటిల్ తనకే మాత్రం నచ్చలేదని...ఆ టైటిల్ చూడండిఎలా ఉందో అంటూ! కిచపరిచేలా మాట్లాడారు. నిజంగా అది సినిమా టైటిలా? దాన్ని టైటిల్ అంటారా? అలాంటి టైటిల్స్ ఉన్న సినిమాలు తాను చూడనని అసహనాన్ని వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా జయాబచ్చన్ వ్యాఖ్యలపై ఆ చిత్ర నిర్మాత ప్రేరణా అరోరా మండిపడ్డారు.
జయాబచ్చన్ తమ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను చూసి మాట్లాడాల్సి ఉందన్నారు. తాను ఎంతగానో అభిమానించే నటి ఇలా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదన్నారు. 'మా సినిమాని ప్లాప్ అన్నారు. ఆమె ఓసారి మా సినిమా బాక్సాఫీస్ వసూళ్లు చూడాల్సింది. 2017లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ హిట్లలో తమ సినిమా ఒకటన్నారు. భారీ మొత్తంలో లాభాలొచ్చాయి. ఎంతో ఆలోచించి కథకు అనుగుణంగా టైటిల్ పెట్టాం.
మా సినిమా ద్వారా కొంత సందేశాన్ని సమాజానికి అందించాం. అలాంటి సినిమాపై జయాబచ్చన్ వ్యాఖ్యలు ఏమాత్రం సబబు గా లేవంటూ అసహనం వ్యక్తం చేసారు. `టాయిలెట్ ఏక్ ప్రేమ కథ` చిత్రం 70 కోట్లతో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ సినిమాని ఇతర భాషల్లో రీమేక్ చేస్తే మంచి సినిమా అవుతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. సమాజానికి మంచి సందేశాత్మక చిత్రంగానూ నిలుస్తుందని భావించారు.
అప్పటి ప్రభుత్వ పెద్దలు..అధికారులు కూడా సినిమా గురించి ఎంతో పాజిటివ్ పీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇందులో అక్షయ్ కుమార్, భూమీ పడ్నేకర్ జంటగా నటించారు. ఇద్దరి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని శ్రీ నారాయణ్ సింగ్ తెరకెక్కించారు.