'జూటురు రాజు'... జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్ లో నటుడు ఆయనేనా?

సుమారు అర్ధశతాబ్ధం పాటు రాజకీయాలు చేసిన ఆయన జీవితం ఇప్పుడు సినిమాగా తెరకెక్కబోతోందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-10-25 07:51 GMT

ఉమ్మడి ఏపీలో, ప్రధానంగా రాయలసీమ రాజకీయాల్లో ఓ ప్రత్యేకమైన చరిత్ర కలిగిన అరుదైన నాయకుల్లో జేసీ దివాకర్ రెడ్డి ఒకరని చెప్పొచ్చు. అందుకేనేమో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన తెలియని వారుండరని అంటారు. సుమారు అర్ధశతాబ్ధం పాటు రాజకీయాలు చేసిన ఆయన జీవితం ఇప్పుడు సినిమాగా తెరకెక్కబోతోందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేస్తూ తాడిపత్రి కేంద్రంగా అనంతపురం జిల్లా రాజకీయాల్ని సుమారు ఏభై ఏళ్ల పాటు శాసించినట్లు చెప్పబడే జేసీ దివాకర్ రెడ్డి జీవితం వెండి తెరపై ఆవిష్కరించబోతున్నారని అంటున్నారు. దీంతో... ఈ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది.

రాజకీయాల్లో ముస్సుకూటిగా మాట్లాడుతు ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్ ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇలా. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన జేసీ దివాకర్ రెడ్డి జీవితం తెరకెన్ననుండటంతో.. ఎలాంటి సంచలనలు వెలుగు చూస్తాయో అనే చర్చా మొదలైంది.

ఇక ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు.. జేసీ దివాకర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే ఈ బయోపిక్ కి "జూటూరు రాజు" పేరును కన్ఫాం చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో దివాకర్ రెడ్డి పాత్రను సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పోషించనున్నారని.. ఆయనైతే కరెక్ట్ గా సెట్ అవుతారని భావిస్తున్నారని అంటున్నారు.

ఇదే క్రమంలో... ఈ సినిమాకు జేసీ కుటుంబ సభ్యులే నిర్మాతలుగా వ్యవహరించనున్నారని.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పలు చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు ఒకరు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని.. త్వరలో దీనికి సంబంధించిన పనులు అధికారికంగా మొదలవ్వబోతున్నాయని.. రకరకాలా ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి.

Tags:    

Similar News