దృశ్యం 3... గాయని చిత్ర ఐడియా
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జీతూ జోసెఫ్ మాట్లాడుతూ... దృశ్యం సినిమా ను తీసిన సమయంలో సెకండ్ పార్ట్ గురించిన ఆలోచన లేదు.
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం మరియు దృశ్యం 2 సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా దృశ్యం సినిమా మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు దృశ్యం 3 సినిమా కోసం మలయాళ సినీ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దృశ్యం 3 కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు ఇటీవల దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జీతూ జోసెఫ్ మాట్లాడుతూ... దృశ్యం సినిమా ను తీసిన సమయంలో సెకండ్ పార్ట్ గురించిన ఆలోచన లేదు. అందుకే దృశ్యం వచ్చిన చాలా రోజుల తర్వాత సీక్వెల్ కోసం కథ ను రెడీ చేయడానికి సమయం పట్టింది. అయితే దృశ్యం 3 కి ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. దృశ్యం 2 విడుదల అయిన వెంటనే పార్ట్ 3 కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను మొదలు పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. సెకండ్ పార్ట్ మేకింగ్ సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఇబ్బందులు దృశ్యం 3 కి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాను.
ఇప్పటికే దృశ్యం కథను ఎలా ముగించాలి అనే విషయంలో క్లారిటీ వచ్చింది. కథ ముగింపు పాయింట్ ను ఇప్పటికే మోహన్ లాల్ కి చెప్పాను. ఆయనకు కూడా నచ్చింది. అయితే దృశ్యం 3 ని ఎలా ప్రారంభించాలి అనే విషయమై చాలా రోజులుగా సందిగ్ధంలో ఉన్నాను. కథ ఎక్కడ నుంచి ప్రారంభించాలి అనే విషయమై చాలా చర్చలు జరిగాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రముఖ గాయని చిత్ర గారిని కలవడం జరిగింది. ఆ సమయంలో దృశ్యం 3 గురించి చర్చ జరిగింది. అప్పుడే చిత్ర గారు చిన్న ఐడియా ఇచ్చారు. ఆ ఐడియా ప్రకారం సినిమా కథను రెడీ చేస్తున్నాం అన్నాడు.
మలయాళంలో దృశ్యం 3 విడుదల అవ్వడమే ఆలస్యం రీమేక్ చేసేందుకు తెలుగు మరియు హిందీ ఫిల్మ్ మేకర్స్ రెడీ గా ఉన్నారు. దృశ్యం 3 లోని పాత్రలు మరియు కథ ఎలా ఉండబోతుంది అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీతూ జోసెఫ్ చెప్పిన మాట ప్రకారం దృశ్యం 3 ను ఈ ఏడాది చివర్లోనే ప్రారంభించి వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే దృశ్యం 3 ని చేసేందుకు వెంకటేష్ కూడా ఓకే చెప్పాడట.