గిట్టని వాళ్ల వల్ల పిల్లల కెరీర్ ఎఫెక్ట్ కాకూడదు!-జీవిత
"జీవితంలో ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదని తెలుసుకున్నాం. నిర్మొహమాటంగా మాట్లాడటం వల్ల వివాదాలను ఎదుర్కొన్నాం. అందుకే ఇప్పుడు మాట్లాడటం తగ్గించేశాను" అని అన్నారు జీవిత రాజశేఖర్.
"జీవితంలో ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదని తెలుసుకున్నాం. నిర్మొహమాటంగా మాట్లాడటం వల్ల వివాదాలను ఎదుర్కొన్నాం. అందుకే ఇప్పుడు మాట్లాడటం తగ్గించేశాను" అని అన్నారు జీవిత రాజశేఖర్. పిల్లల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని .. మా వల్ల వారి కెరీర్ ఎఫెక్ట్ కాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తామంటే గిట్టని వారి వల్ల ఇబ్బందులు ఉంటాయని కూడా అన్నారు.
ఉన్నది ఉన్నట్టు చెబితే కొందరికి నచ్చదు..అందుకే మాట్లాడటం తగ్గించేశాం.. తప్ప భయపడి కాదు! అని అన్నారు. అన్ని అంశాలపై మాట్లాడకపోవడం వల్ల నేను, రాజశేఖర్ ఏమీ నష్టపోలేదు. ఇప్పుడు హాయిగా ఉన్నాం అని కూడా వ్యాఖ్యానించారు. తాము మౌనంగా ఉంటున్నామంటే భయం వల్ల కాదని, జాగ్రత్త వల్ల అని కూడా అన్నారు.
తాను కుటుంబానికి, పిల్లలకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్లనే అప్పట్లో మాతృదేవోభవ ఆఫర్ వదులుకున్నానని, ఆ అవకాశం తొలిగా తనకు వచ్చినా కానీ చేయలేదని జీవిత రాజశేఖర్ తెలిపారు. తాను వద్దనుకున్న తర్వాత మాధవి ఆ పాత్రలో నటించారని కూడా అన్నారు. 33ఏళ్ల గ్యాప్ తర్వాత లాల్ సలాంలో నటించాను. ఇప్పటికీ పిల్లలు కుటుంబం నా తొలి ప్రాధాన్యత అని కూడా తాజా ఇంటర్వ్యూలో జీవిత వెల్లడించారు.