లూసిఫర్ సీక్వెల్ L2E - ఏకంగా GOT నటుడినే దింపేస్తున్నారుగా..

మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లూసిఫర్ సీక్వెల్ L2E: ఎంపురాన్ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.

Update: 2025-02-25 14:01 GMT

మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లూసిఫర్ సీక్వెల్ L2E: ఎంపురాన్ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. 2019లో వచ్చిన లూసిఫర్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో సీక్వెల్‌పై ఆతృత మరింత పెరిగింది. ఈసారి సినిమా బడ్జెట్‌, స్కేల్‌, నటీనటుల పరంగా మరింత గ్రాండ్‌గా రూపొందుతోంది.

అయితే, సినిమా గురించి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఆసక్తిని పెంచుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకి హాలీవుడ్ టచ్ కూడా ఇచ్చారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ (GOT) ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆయన బోరిస్ ఒలివర్ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి మూవీపై మరింత హైప్ పెరిగింది.

బ్రోన్ పాత్రతో గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న జెరోమ్, జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిరర్ వంటి పలు ప్రాజెక్ట్స్‌లో కూడా నటించారు. తాజాగా ఎంపురాన్‌లో భాగం కావడం విశేషం. జెరోమ్ మాట్లాడుతూ, “నాకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు స్పష్టంగా గుర్తు లేదు. కానీ, ఇది చేయడంపై చాలా సంతోషంగా ఉన్నా. యూకే, యుఎస్ స్టైల్ సినిమాల కంటే ఇది పూర్తి భిన్నమైన అనుభవం. మాలీవుడ్ కల్చర్‌లో భాగం కావడం నిజంగా స్పెషల్,” అని పేర్కొన్నారు.

అలాగే, ఇండియాలో గడిపిన రోజులు తన జీవితంలో ప్రత్యేకంగా నిలిచాయని జెరోమ్ అన్నారు. "నా 20ల చివరలో, 30ల ప్రారంభంలో, ఆధ్యాత్మిక యాత్రల కోసం చాలా సార్లు ఇండియాకు వచ్చాను. ఆ అనుభవం నా జీవితాన్ని శాశ్వతంగా మార్చింది," అని చెప్పారు. అయితే, తన పాత్ర గురించి పూర్తి వివరాలు చెప్పేందుకు జెరోమ్ నిరాకరించారు. కానీ, ఖురేషి పాత్ర ప్రయాణంలో ఇది కీలకమైన భాగమని, ఆ క్యారెక్టర్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.

L2E: ఎంపురాన్ ను పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఏంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, పృథ్విరాజ్, ఇంద్రజిత్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, సనియా అయ్యప్పన్, సాయి కుమార్, బైజు సంతోష్ లాంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 27, 2025న L2E: ఎంపురాన్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది. అటు హాలీవుడ్ నటుడు, ఇటు మాలీవుడ్ స్టార్ కాస్ట్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆసక్తి పెరుగుతోంది.

Full View
Tags:    

Similar News