జిగ్రా (X) విక్కీ విద్యా: ఎమోష‌న‌ల్ డ్రామాపై కామెడీదే పైచేయి?

అత‌డు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో విక్కీ విద్యా.. లో న‌టించాడు.

Update: 2024-10-10 03:40 GMT

అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్, ఎమోష‌న్, యాక్ష‌న్ వీట‌న్నిటి క‌ల‌గ‌లుపుగా తెర‌కెక్కింది జిగ్రా. ఆలియా భ‌ట్ లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషించ‌గా, ఇటీవ‌లే ట్రైల‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే స్త్రీ న‌టుడు రాజ్ కుమార్ రావు న‌టించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో (VVKWWV) చిత్రం జిగ్రాకు గ‌ట్టి పోటీనివ్వ‌బోతోంద‌న్న టాక్ వినిపిస్తోంది.

ఇటీవ‌లే స్త్రీ 2తో 500కోట్ల క్లబ్ హీరో అయ్యాడు రాజ్ కుమార్ రావు. అత‌డు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో విక్కీ విద్యా.. లో న‌టించాడు. అత‌డితో పాటు వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న ట్రిప్తీ దిమ్రీ కూడా ఈ చిత్రంలో క‌నిపించ‌డం పెద్ద ప్ల‌స్ కానుంది. ప్ర‌చార సామాగ్రిని బట్టి ఈ సినిమా పూర్తి వినోదాత్మ‌క‌ క‌థ‌తో రూపొందింది. మ‌రోవైపు జిగ్రా ట్రైల‌ర్ చూడ‌గానే ఇది సీరియ‌స్ స్టోరీతో ర‌న్ అయ్యే సినిమా అని అర్థ‌మ‌వుతుంది. ఎమోష‌న్స్, యాక్ష‌న్ ప‌రాకాష్ట‌లో చూపించారు. ఆస‌క్తిక‌రంగా ఆలియా సినిమాని క‌ర‌ణ్ జోహార్ నిర్మించ‌గా ఆలియా స‌మ‌ర్పించారు.

అయితే ఈ రెండు సినిమాల్లో పండ‌గ సీజ‌న్‌కి సూట‌య్యే సినిమా ఏది? అంటే రాజ్ కుమార్ రావు సినిమాకే ఎక్కువ మార్కులు ప‌డుతున్నాయి. ఈ సెల‌వుల్లో పూర్తిగా కామెడీ, వినోదానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. బ‌రువైన కంటెంట్ ఉన్న సినిమాల కంటే ఆడియెన్ తేలిక పాటి హాస్యానికే అధిక ప్రాధాన్య‌త‌నిచ్చే వీలుంటుందని అంచ‌నా. ప్ర‌మోష‌న్స్ లో ఏ ఒక్క‌రూ త‌గ్గ‌డం లేదు. కానీ ఎవ‌రిది పై చేయి అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News