జ‌న‌సేన సంక్షోభానికి జోగ‌య్య మాత్ర‌!

విజ‌య‌వాడ టికెట్ ఆశించి.. ఇంకా డైల‌మాలో పెట్టడంతో ఓ యువ నేత రాజ‌కీయాల కు దూర‌మ‌నే చ‌ర్చ చేస్తున్నారు.

Update: 2024-02-25 09:28 GMT

ప్ర‌స్తుతం ఏపీ జ‌న‌సేన పార్టీలో క‌ల‌క‌లం కొన‌సాగుతూనే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీతో క‌లిసి ప్ర‌యాణం చేస్తామ‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నీసంలో క‌నీసం 30-40 స్థానాలు తీసుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో 24 సీట్ల‌కే ప‌రిమి త‌మ‌య్యారు. దీనిపై జ‌న‌సైనికులు మండిప‌డుతున్నారు. జగ్గంపేట టికెట్ ఆశించిన సూర్య చంద్ర నిరా హార దీక్ష‌కు దిగారు. విజ‌య‌వాడ టికెట్ ఆశించి.. ఇంకా డైల‌మాలో పెట్టడంతో ఓ యువ నేత రాజ‌కీయాల కు దూర‌మ‌నే చ‌ర్చ చేస్తున్నారు.

ఇక‌, ఎంతో ఊపు , మేలి మ‌లుపు ఖాయ‌మ‌ని ఆది నుంచి అంచ‌నాలు ఉన్న ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో జ‌న సేన నాయకులు తాజాగా ప‌రిణామాల త‌ర్వాత‌.. ఎక్క‌డి వారు అక్క‌డ దుప్ప‌టి ముసుగుపెట్టి కునుకు తీ స్తున్నారు. సో.. 24 అంకె.. జ‌న‌సేన‌కు న‌చ్చినా.. సైనికులు మాత్రం దీనిని అచ్చిరాని సంఖ్య‌గానే భావిస్తు న్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో `కాపు సంక్షేమ సేన‌` వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ య్య జోగ‌య్య రియాక్ట్ అయ్యారు.

సీట్ల పంప‌కంలో అన్యాయం చేశార‌ని.. ఏ ప్రాతిప‌దిక‌న సీట్లు ఇచ్చార‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు. తాజా గా రాసిన బ‌హిరంగ లేఖ‌లో టీడీపీ మాయ‌లో ప‌వ‌న్ ప‌డ్డార‌న్న‌ట్టుగా వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు జ‌న‌సేన నేత‌ల ఆకాంక్ష‌లు వేరేగా ఉన్నాయ‌ని తెలిపారు. వాటిని ప‌ట్టించుకోలేద‌న్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న చూ సుకున్నా.. 60 స్థానాల‌ను కాపుల‌కు ఇవ్వాల‌ని కోరారు. దీనికి సంబంధించి గ‌తంలోనే ప‌వ‌న్ ఒక క్లారిటీకి వ‌చ్చార‌ని. 60 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను కూడా రెడీ చేసుకున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

కానీ.. ఇప్పుడు ఎక్కువ సీటు ఇస్తే.. రేపు అధికారంలోకి వ‌చ్చాక‌.. ఎక్క‌వు ప‌ద‌వులు అడుగుతార‌న్న ఉద్దేశం తోనే టీడీపీ సీట్లు త‌గ్గించింద‌ని, దీనికి ప‌వ‌న్ ఎలా అంగీక‌రించార‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. మ‌ధ్యే మార్గంగా ప్ర‌స్తుతం నెల‌కొన్న వివాదాల‌కు చెక్ పెట్టాలంటే.. ప‌ద‌వుల విష‌యాన్ని ప్ర‌స్తావించాల‌ని సూచించారు. వ‌చ్చే ప్ర‌భుత్వం రెండున్న‌రేళ్లు ముఖ్య ప‌ద‌విని ప‌వ‌న్ ఇచ్చేలా.. స‌గం మంత్రి ప‌ద‌వులు జ‌న‌సేన నాయ‌కుల‌కు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాల‌ని సూచించారు. అంతేకాదు.. ఈ మాట చంద్ర‌బాబు నోటి నుంచి చెప్పించాల‌ని కూడా జోగ‌య్య వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుత ర‌గ‌డ‌కు ఇదే మందు అని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.


Full View


Tags:    

Similar News