ఆ వార్తకు గుండె పగిలిందన్న స్టార్ హీరో
అవును.. అతడు ఉలిక్కిపడ్డాడు..! ఆ ఒక్క వార్తతో గుండె పగిలిందని ఆవేదన చెందినట్టు తెలిపాడు.
అవును.. అతడు ఉలిక్కిపడ్డాడు..! ఆ ఒక్క వార్తతో గుండె పగిలిందని ఆవేదన చెందినట్టు తెలిపాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తన సినిమా ఫ్లాపవ్వడే దీనికి కారణం. వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ సింహబలుడు జాన్ అబ్రహాం గురించే ఇదంతా. అతడు నటించిన `వేదా` ఇటీవల విడుదలైంది. దూకుడుగా ప్రమోట్ చేసినప్పటికీ వేదా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా ముగిసింది. జాన్ అబ్రహం ఎట్టకేలకు ఫెయిల్యూర్‌పై స్పందించాడు. బాక్సాఫీస్ వద్ద తన చిత్రం ఫ్లాప్ కావడం చూసి గుండె పగిలిందని చెప్పాడు. బలమైన టీమ్ తో మసినిమా విజయం కోసం నేను చాలా కష్టపడ్డాను. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడం బాధ కలిగించింది! అని జాన్ చెప్పారు.
నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన `వేదా` యాక్షన్ డ్రామా. కానీ జనాల్ని థియేటర్లకు రప్పించడంలో విఫలమైంది. తన కెరీర్లో అన్నీ యాక్షన్ చిత్రాలను మాత్రమే చేసినందుకు ఒక రిపోర్టర్ ప్రశ్నించగా, అతడిని తిట్టడంతో జాన్ అబ్రహాం పేరు మీడియాలో హైలైట్ అయింది. విలేకరి పట్ల జాన్ అసభ్య ప్రవర్తనను తప్పు పడుతూ ట్రోలింగ్ జరిగింది. జాన్ తన తప్పును అంగీకరించాడు... అతను బలంగా తిరిగి వస్తానని చెప్పాడు.
వేదా ఆగస్ట్ 15న విడుదలైంది. సుదీర్ఘమైన 5 రోజుల వారాంతంలో క్యాష్ చేసుకోవడమే ధ్యేయంగా ప్లాన్ చేసినా ఆశించిన వసూళ్లు దక్కలేదు. శ్రద్ధా కపూర్ - స్త్రీ 2 , అక్షయ్ యొక్క ఖేల్ ఖేల్ మేతో ఘర్షణ పడటం మైనస్ గా మారింది. కేవలం రూ. 17.6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం 20 కోట్లు మాత్రమే రాబట్టింది. 30 కోట్ల మేర పంపిణీ వర్గాలకు నష్టాలు వాటిల్లాయని అంచనా.