బిగ్ బాస్ 7 : అందరి అటెన్షన్ ఆమె మీదే.. ఎంట్రీతోనే ఎట్రాక్షన్..!

బిగ్ బాస్ సీజన్ 7 తమిళం లో కంటెస్టెంట్ గా వచ్చిన వారిలో జోవిక విజయ్ కుమార్ ఆకర్షణగా నిలిచారు. నటి వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక వినయ్ కుమార్

Update: 2023-10-02 07:40 GMT
బిగ్ బాస్ 7 : అందరి అటెన్షన్ ఆమె మీదే.. ఎంట్రీతోనే ఎట్రాక్షన్..!
  • whatsapp icon

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు నాలుగు వారాల క్రితం మొదలై ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 దారుణంగా ఫ్లాప్ అవ్వడం వల్ల సీజన్ 7 ని సరికొత్త టాస్క్ లతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆడియన్స్ ని ఎంగేజ్ అయ్యేలా చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు సంగతి ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 7 తమిళ్ కూడా అక్టోబర్ 1న గ్రాండ్ గా మొదలైంది. మన దగ్గర కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగిస్తున్నట్టుగానే అక్కడ లోక నాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నారు.


ఆదివారం తమిళ బిగ్ బాస్ సీజన్ 7 మొదలైంది. ఇంతకీ ఆ షోలో కంటెస్టెంట్స్ ఎవరు..? సీజన్ 7 అక్కడ ఎంతమంది కంటెస్టెంట్స్ వచ్చారన్నది ఒకసారి చూస్తే.. బిగ్ బాస్ సీజన్ 7 షోలో సీనియర్లు, జూనియర్లు మిక్సెడ్ గా కంటెస్టెంట్స్ ఉన్నారు. తెలుగు సీజన్ కి భిన్నంగా తమిళ సీజన్ లో రెండు హౌస్ లను ఏర్పాటు చేసి సర్ ప్రైజ్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 7 తమిళం లో కంటెస్టెంట్ గా వచ్చిన వారిలో జోవిక విజయ్ కుమార్ ఆకర్షణగా నిలిచారు. నటి వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్. జోవిక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ గా పనిచేస్తుంది. వనిత విజయ్ కుమార్ నడుపుతున్న వంటల యూట్యూబ్ ని జోవిక చూసుకుంటుంది. తల్లి అడుగుజాడల్లోనే బిగ్ బాస్ లోకి వచ్చింది జోవిక.

షోలో అడుగు పెట్టిన జోవిక ఎమోషనల్ అయ్యారు. ఇంటి నుంచి వచ్చినప్పటికీ తన మదర్ కూడా ఉన్నారనే ఫీలింగ్ తో ఉన్నానని చెప్పింది. మానసికంగా నా మదర్ తోడుగా ఉంటుందని జోవిక చెప్పింది. చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జోవిక మోడల్ గా కెరీర్ ఆరంభించగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది.

యూట్యూబ్ కుకింగ్ వీడియోలతో ఆమె క్రేజ్ తెచ్చుకుంది. అవకాశం వస్తే సినిమాల్లో నటించాలని అనుకుంటుంది జోవిక. బిగ్ బాస్ తమిళ షో కూడా 100 రోజులు కొనసాగనుంది. విజయ్ టీవీ తో పాటుగా డిస్నీ హాట్ స్టార్ లో కూడా ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ స్టార్ మాలో బిగ్ బాస్ మొదలయ్యే రాత్రి 9:30 గంటలకు విజయ్ టీవీలో తమిళ బిగ్ బాస్ మొదలవుతుంది.

Tags:    

Similar News