ఎన్టీవోడి మాట.. రామబాణమే కదా..!
చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ ఒక నందమూరి సినిమా వేడుకకి రావడం ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. అంతేకాదు ఎన్టీఆర్ స్పీచ్ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు వాళ్ల హృదయాలను టచ్ చేశాయి.;

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నా వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. తారక్ రాకతో నందమూరి ఫ్యాన్స్ సూపర్ జోష్ కనబరిచారు. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ ఒక నందమూరి సినిమా వేడుకకి రావడం ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. అంతేకాదు ఎన్టీఆర్ స్పీచ్ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు వాళ్ల హృదయాలను టచ్ చేశాయి.
ఐతే సినిమా గురించి చెబుతూ తాను సినిమా చూశానని చివరి 20 నిమిషాలు ఎమోషనల్ రైడ్ అని.. కన్నీళ్లతో అందరు వస్తారని అన్నారు తారక్. అంతేకాదు కళ్యాణ్ రామ్ అన్న కాలర్ ఎగరేసే సినిమా అవుతుందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అన్న సినిమా ఈసారి పక్క బ్లాక్ బస్టర్ అని ఎన్టీఆర్ చెప్పేశాడు. అందుకే ఈసారి ఫ్యాన్స్ కాదు అన్న కాలర్ ఎగరేస్తాడంటూ తన జోష్ కనబరిచాడు.
ఎన్టీఆర్ సినిమా జడ్జిమెంట్ బాగుంటుంది. సినిమా బాగుంటే తప్ప ఆయన ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడు. స్టార్ సినిమాలు కథల ఎంపికలో ఆ క్లారిటీ ఉండటం వల్లే వాళ్లు ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టగలుగుతున్నారు. సో ఎన్టీఆర్ జడ్జిమెంట్ కూడా చాలా నమ్మకంగా ఉంటుంది. అందుకే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు ఎన్టీఆర్ ఇచ్చిన రివ్యూ నందమూరి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తెచ్చింది.
కళ్యాణ్ రామ్ కెరీర్ లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రత్యేక సినిమాగా నిలుస్తుందా లేదా అన్నది ఈ నెల 18న తెలుస్తుంది. ఐతే సినిమా ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ రాసి పెట్టుకోండి సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పడం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ఇదివరకు ఎన్టీఆర్ ఇలా బల్లగుద్ది చెప్పిన సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. సో ఆ లెక్కన ఎన్టీవోడి మాట రామబాణమే అవుతుందా లేదా అనుకుంటూ నందమూరి ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
ఎన్టీఆర్ ఈవెంట్ కి రావడం తోనే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు సూపర్ బజ్ వచ్చింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఫలితాన్ని అందుకునేలా వైబ్ కనిపిస్తుంది. మరి కళ్యాణ్ రామ్ సినిమా ఏమేరకు హంగామా చేస్తుంది అన్నది చూడాలంటే మరో ఐదు రోజులు వెయిట్ చేయాల్సిందే.