`దేవర 2` కోసం ఎన్టీఆర్ ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నాడు?
జక్కన్న తెరకెక్కించిన RRRతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థార్‌ల జాబితాలో చేరిపోయిన విషయం తెలిసిందే.;

జక్కన్న తెరకెక్కించిన RRRతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థార్‌ల జాబితాలో చేరిపోయిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా రూ.1000 కోట్లకు పైనే రాబట్టిన ఈ సినిమా ఆస్కార్‌ని కూడా ముద్దాడటంతో రామ్‌చరణ్‌తో పాటు ఎన్టీఆర్ పేరు కూడా వరల్డ్ వైడ్‌గా మారుమోగింది. నేషనల్ వైడ్‌గానూ ఎన్టీఆర్‌కు భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్‌ని ఈ సినిమా ఏర్పరచింది. అంటే కాకుండా బాలీవుడ్‌లోనూ ఎన్టీఆర్‌కు భారీ డిమాండ్‌ని తెచ్చి పెట్టింది.
ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ చేసిన భారీ యాక్షన్ డ్రామా `దేవర`. కొరటాల శివ అత్యంత భారీగా ప్లాన్ చేసి రూపొందించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. RRR తరువాత ఎన్టీఆర్ ఇలాంటి కథతో సినిమా చేయడం అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడికి ఏమాత్రం రుచించలేదు. ఏమాత్రం పసలేని కథతో కొరటాల రూపొందించిన ఈ సినిమా RRR తరువాత ఎన్టీఆర్‌కు ఏర్పడిన క్రేజ్ కారణంగానే ఆడిందే కానీ కథలో దమ్ముందని కాదు.
కంటెంట్ చాలా వీక్. ఎన్టీఆర్‌కున్న స్టార్ పవర్ కారణంగానే `దేవర` ఆడేసింది. బాక్సాఫీస్ వద్ద ఓ స్థాయిలో వసూళ్లని రాబట్టింది. ఎన్టీఆర్‌కు RRR తరువాత ఏ మాత్రం పనికిరాని ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తుండటం పలువురుని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. త్వరలో `దేవర`కు సీక్వెల్‌గా `దేవర 2`ని దర్శకుడు కొరటాల శివ తెరపైకి తీసుకురానున్న విషయం తెలిసిందే.
ఫస్ట్ పార్ట్ స్టోరీ చాలా వీక్. అయినా సరే ఎన్టీఆర్ పార్ట్ 2 కోసం ఇంత ఉత్సాహంగా ఎందుకు ఎదురు చూస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పార్ట్ 2లో అంత గొప్ప కథ ఉందా? లేక కమిట్ అయ్యాడు కాబట్టే పూర్తి చేయాలని ఎన్టీఆర్ ఎదురు చూస్తున్నారా? లేకపోతే ఎన్టీఆర్‌కు దేవర క్యారెక్టర్ బాగా ఎక్కేసిందా? అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో `దేవర 2`పై అభిమానుల్లో, సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో `వార్ 2` చేస్తున్న విషయం తెలిసిందే. దీని తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు.