దేవర 2.. ఎన్టీఆర్ ఏం చేస్తాడు..?

చెప్పడానికి చిన్న కథ ఉన్నా దానికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఎన్టీఆర్ ఎనర్జీని పర్ఫెక్ట్ గా వాడుకుంటే దేవర 2 హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Update: 2025-01-08 01:30 GMT

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర పార్ట్ 1 ఫస్ట్ షో టాక్ బాగా లేకపోయినా తారక్ స్టామినాతో ఎలాగోలా సినిమాను లాక్కొచ్చేశాడు. ప్రాఫిట్స్ అండ్ లాస్ విషయాలను పక్కన పెడితే ఎన్టీఆర్ దేవర ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇచ్చింది. RRR లో ఎన్టీఆర్ నటించినా కూడా సోలోగా వచ్చి చాలా రోజులు అవుతున్న కారణంగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఐతే దేవర అనుకున్నంత రేంజ్ కాకపోయినా ఆడియన్స్ ని అలరించింది. ఐతే ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉందని తెలిసిందే.

సినిమా సూపర్ హిట్ అయితే పార్ట్ 2 ఎప్పుడా అన్న ఎగ్జైట్ మెంట్ ఉండేది కానీ దేవర 1 ఫైనల్ గా యావరేజ్ సినిమాగా నిలవడంతో పార్ట్ 2 మీద అంత గురి లేదు. ఫ్యాన్స్ కూడా పార్ట్ 2 గురించి అడగట్లేదు. అసలు దేవర 2 కథ ఏముంటుంది. ఎలాగు పార్ట్ 1 లోనే దేవర మృతిచెందాడని చూపించాడు.. కానీ అతన్ని చంపింది ఎవరు అన్నది పార్ట్ 2 లో చూపించాల్సి ఉంటుంది. మరోపక్క అజయ్ వెతుక్కుంటూ వచ్చిన పాత్ర ఏమైంది ఆ కథ కూడా పార్ట్ 2 లోనే ఉంటుంది.

చెప్పడానికి చిన్న కథ ఉన్నా దానికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఎన్టీఆర్ ఎనర్జీని పర్ఫెక్ట్ గా వాడుకుంటే దేవర 2 హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు దేవర 1 లో మిస్సైన కొన్ని అంశాలను కూడా పార్ట్ 2 లో జాగ్రత్త పడే ఛాన్స్ ఉంటుంది. దేవరలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్ర కేవలం గ్లామర్ కోసమే అన్నట్టు ఉంది. రిలీజ్ ముందు జాన్వి కపూర్ రెండు పేజీల డైలాగ్ అంటూ ఊరించి సినిమాలో అది మిస్సయ్యే సరికి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

సో దేవర 2 లో ఎన్టీఆర్ తో పాటు జాన్వి కపూర్ పాత్ర మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దేవర 1కి అనిరుద్ మ్యూజిక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. సినిమా ఈ రేంజ్ సక్సెస్ కు కారణం తెర మీద తారక్ తెర వెనక అనిరుద్ మ్యూజిక్ అన్నట్టు చేశాడు. సో దేవర 2 మీద అతను కూడా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఐతే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చేస్తున్నాడు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఆ రెండిటితో పాటు దేవర 2 కూడా చేయాల్సి ఉంటుంది. దేవర 2 కొంత భాగం రష్ ఉంది. సో సినిమా పార్ట్ 1 కి పట్టిన టైం పట్టకపోవచ్చు కానీ ఎన్టీఆర్ ఆ సినిమాకు డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News