లైనప్ లెక్క తేల్చిన తారక్.. ఇవే ఆ 4 సినిమాలు
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తన అప్ కమింగ్ చిత్రాలపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు.;

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తన అప్ కమింగ్ చిత్రాలపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తన లైనప్ ఉన్న అన్ని సినిమాల గురించి మాట్లాడారు. అదే సమయంలో తాను ఇప్పటికే నటించిన రెండు చిత్రాల సీక్వెల్స్ అప్డేట్స్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి.
తారక్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ నటించిన మ్యాడ్ స్క్వేర్ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ మూవీని నాగవంశీ సమర్పించారు. అయితే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ నిన్న హైదరాబాద్ లో జరగ్గా.. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అలా లైనప్ లెక్క తేల్చేశారు.
మ్యాడ్ స్క్వేర్ మూవీ టీమ్ అందరి కోసం తొలుత మాట్లాడిన తారక్.. ఆ తర్వాత తన గత మూవీ దేవర టాపిక్ ను ప్రస్తావించారు. ఆ సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వగా.. ఆ తర్వాత విజయోత్సవ వేడుక కూడా కొన్ని కారణాల వల్ల జరగలేదు.
దీంతో మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో తన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ తెలిపారు ఎన్టీఆర్. ఆ తర్వాత దేవర సీక్వెల్ కోసం మాట్లాడారు. నిజానికి.. దేవర సీక్వెల్ క్యాన్సిల్ అయిందని అప్పట్లో టాక్ వచ్చింది. డైరెక్టర్ కొరటాల శివ, తారక్.. ఇద్దరూ పార్ట్ పై ఆసక్తిగా లేరని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు తారక్.. కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని తెలిపారు.
దేవర-2 లేదని అనుకున్న వారందరికీ చెబుతున్నా.. కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని తెలిపారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తుండడం వల్ల దేవర-2కు గ్యాప్ ఇచ్చానని చెప్పారు. దీంతో కొరటాల శివతో దేవర-2, ప్రశాంత్ నీల్ తో సినిమా.. రెండు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలా లైనప్ లోని రెండు ప్రాజెక్టులను కన్ఫర్మ్ చేశారు.
ఆ తర్వాత నాగవంశీ నిర్మాతగా తాను ఓ సినిమా చేయనున్నానని వెల్లడించారు తారక్. ఆయనే ఆ మూవీ అనౌన్స్ చేస్తారని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన డే ఫ్యాన్స్ ను హ్యాండిల్ చేసే పూర్తి బాధ్యత తనకు అప్పగించబోతున్నట్లు చెప్పారు. పొగడాలన్నా, తిట్టాలన్నా వంశీనే ఇన్ ఛార్జ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ మూవీనే నాగవంశీ నిర్మించనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో కామెడీ చేయడం కష్టమని, ఆ విషయంలో చాలా భయపడుతున్నట్లు చెప్పారు. అందుకే తాను అదుర్స్ 2 చేయడం లేదని నవ్వుతూ అన్నారు ఎన్టీఆర్.
మరోవైపు, తారక్ చేతిలో వార్-2 ఉన్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా.. ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి తన లైనప్ లో నాలుగు చిత్రాల గురించి ఒకేసారి అప్డేట్ ఇచ్చారు తారక్.