బ్లాక్ సూట్‌లో సూపర్ స్టైలిష్ గా ఎన్టీఆర్
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ రీసెంట్ గా దుబాయ్ లోని ఓ ప్రముఖ నిర్మాత కొడుకు పెళ్లికి హాజరైన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో ఎన్టీఆర్ హైలైట్ అయ్యాడు.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఎన్టీఆర్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో తన క్రేజ్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకున్న ఎన్టీఆర్, గతేడాది దేవర సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వార్2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ రీసెంట్ గా దుబాయ్ లోని ఓ ప్రముఖ నిర్మాత కొడుకు పెళ్లికి హాజరైన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో ఎన్టీఆర్ హైలైట్ అయ్యాడు. ఆ వేడుకలో నుంచి తారక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటికొచ్చాయి. అందులో ఎన్టీఆర్ బ్లాక్ సూట్ ధరించి గాగుల్స్ పెట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
అంతేకాదు, ఎన్టీఆర్ మునుపటి కంటే ఈ ఫోటోల్లో మరింత స్లిమ్ గా కనిపిస్తున్నాడు. తమ ఫేవరెట్ హీరోను ఇలా చూసిన తారక్ అభిమానులు ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని కామెంట్ చేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే, రీసెంట్ గానే ఎన్టీఆర్ ప్రశాంత నీల్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్ ను నీల్ తెరకెక్కిస్తున్నాడు. మార్చిలో మొదలుకానున్న నెక్ట్స్ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ ఈ షూట్ లో జాయిన్ కానున్నాడు. ఎన్టీఆర్ స్లిమ్ గా తయారైంది నీల్ సినిమా కోసమే అని కొందరంటున్నారు. నీల్ సినిమాతో పాటూ ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో దేవర2ను కూడా పూర్తి చేయాల్సి ఉంది.