వార్ 2: మనోడిని నస పెట్టేస్తున్నారే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూ సినిమా వార్ 2 ఎప్పటినుంచో బిగ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూ సినిమా వార్ 2 ఎప్పటినుంచో బిగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి తెరపై కనిపించబోతుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కుతోంది. బిగ్గెస్ట్ స్పై యూనివర్స్‌లో భాగమైన ఈ సినిమా, దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారిలో టాప్ లిస్ట్‌లో ఉంది.
సినిమా షూటింగ్ ముంబై, అబుదాబి, లండన్ వంటి అంతర్జాతీయ లొకేషన్లలో శరవేగంగా సాగుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ టెక్నీషియన్లను దింపారు. ఎన్టీఆర్ పాత్ర యాక్షన్ పరంగా హై రేంజ్ ఎలివేషన్లు అందుకునేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే, కథలో కీలకమైన ట్విస్ట్‌తో పాటు విలన్ షేడ్స్ కూడా ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ఈ రోల్ వల్ల బాలీవుడ్ మార్కెట్‌లో ఎన్టీఆర్‌కు స్పెషల్ గుర్తింపు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే సినిమా అంచనాలు ఎంత పెరుగుతాయో, షూటింగ్ మాత్రం అదే స్థాయిలో ఆలస్యం అవుతూ వస్తోంది. గతేడాది మధ్యలో షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ అనేక మార్పులు, మళ్లీ రీషెడ్యూల్‌లు, స్క్రిప్ట్ చేంజ్‌లు జరుగుతూనే ఉన్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ సన్నివేశాలు ఇప్పటికీ పూర్తికావాల్సి ఉంది. వాస్తవానికి ఎన్టీఆర్ తాను కేటాయించిన షెడ్యూల్ లో పని పూర్తి చేసుకొని ఈపాటికే కొత్త సినిమా మొదలు పెట్టాల్సి ఉంది.
అయితే వార్ 2 ఆలస్యం కారణంగా ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ NTR 31 ప్రభావితమవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే ఈ హై ఓక్టేన్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వార్ 2 షూటింగ్ ప్లాన్ చేసిన షెడ్యూల్ కంటే ఎక్కువ రోజులు తీసుకోవడంతో, ఎన్టీఆర్ కొత్త సినిమా స్టార్ట్ అవ్వాల్సిన డేట్ కూడా అటకెక్కింది. దీనివల్ల ఎన్టీఆర్ స్వయంగా అసహనానికి గురయ్యారని, ఆలస్యం ఇలాగే సాగితే ప్రభావం మరింత పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఎన్టీఆర్ ను ప్రతీ సారి రిక్వెస్ట్ చేస్తూ నస పెట్టేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే వార్ 2 2025 చివర్లో లేదా 2026 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను అత్యున్నత స్థాయి టెక్నికల్ వండర్‌గా మలచాలని చూస్తుండటంతో ఆలస్యం సహజమే. కానీ, హీరోల డేట్స్‌లో మార్పులు, తదుపరి ప్రాజెక్టులకు ఇబ్బందిగా మారుతున్నాయి. మరి, ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న NTR 31 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.