కుమారుడొస్తే చైత‌న్య మిస్ అయ్యేవాడు!

జునైద్ ఖాన్ న‌టిస్తే ఆ సినిమాకి పెద్ద‌గా క‌లిసి రాడు. ఒక‌వేళ వ‌చ్చినా అది కేవ‌లం నార్త్ వ‌ర‌కే ప‌రిమితం. సౌత్ లో ఆ సినిమా బిజినెస్ జ‌ర‌గ‌దు.

Update: 2024-07-03 07:54 GMT

అమీర్ ఖాన్, కరీనా క‌పూర్, నాగ‌చైత‌న్య న‌టించిన 'లాల్ సింగ్ చ‌డ్డా' భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయి ప‌రాజ‌యం చెందిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సైనికుడు బాల‌రాజు పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టించాడు. త‌న పాత్ర వ‌రకూ ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా న్యాయం చేసాడు. సినిమా హిట్ అయితే చైత‌న్య‌ని మంచి పేరొచ్చేది. కానీ ఫ‌లితం అత‌డి డెబ్యూని నిరాశ‌ప‌రిచింది.

అయితే తొలుత ఈ పాత్ర‌లో న‌టించాల్సింది అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ అని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని జునైద్ ఖాన్ స్వ‌యంగా రివీల్ చేసాడు. 'ఆ పాత్ర‌లో న‌టించాల్సింది నేను. నేను ఆడిష‌న్ కూడా ఇచ్చాను. పాత్ర‌కి ప‌ర్పెక్ట్ సెట్ అయ్యాను. కానీ చివ‌రి నిమిషంలో న‌న్ను తొల‌గించారు' అనితెలిపాడు. ఆ త‌ర్వాత ఆ పాత్ర‌కి నాగ‌చైత‌న్య తీసుకోవ‌డం జ‌రిగింది. అయితే చైతన్య ఎంట్రీ వెనుక మార్కెట్ స్ట్రాట‌జీ ఉంది.

జునైద్ ఖాన్ న‌టిస్తే ఆ సినిమాకి పెద్ద‌గా క‌లిసి రాడు. ఒక‌వేళ వ‌చ్చినా అది కేవ‌లం నార్త్ వ‌ర‌కే ప‌రిమితం. సౌత్ లో ఆ సినిమా బిజినెస్ జ‌ర‌గ‌దు. ఈనేప‌థ్యంలో నాగచైతన్య‌ని తీసుకుని ఇక్క‌డా మంచి బిజినెస్ చేసారు. ఆ సినిమా ప్ర‌చార స‌మ‌యంలో చిరంజీవి, నాగార్జున పాల్గొన‌డం కూడా క‌లిసొచ్చింది. ఇన్ని ర‌కాలుగా క‌లిసొచ్చిందంటే దానికి కార‌ణం చైత‌న్య‌. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌లేదు.

సినిమాకి ప్లాప్ టాక్ తో పాటు అమీర్ ఖాన్ పై ఉన్న విమ‌ర్శ కూడా నెగిటివ్ గా మారింది. దీంత్ బ్యాన్ అమీర్ ఖాన్ సినిమా అనేది తెర‌పైకి వ‌చ్చింది. దీంతో క‌నీసం స‌రైన ఓపెనింగ్స్ కూడా ద‌క్క‌లేదు. అయితే ఈ సినిమా నుంచి జునైద్ ఎగ్జిట్ అవ్వ‌డం అతడికి క‌లిసొచ్చింది. లేదంటే మొద‌టి సినిమాతోనే విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చేది.

Tags:    

Similar News

eac