నాలుగు పదుల వయసులో ఇదేం రచ్చ జగతి మేడం

కన్నడ నటి జ్యోతి రాయ్‌ ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

Update: 2024-09-23 00:30 GMT

కన్నడ నటి జ్యోతి రాయ్‌ ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులు జగతి మేడం అంటూ జ్యోతి రాయ్ ను తెగ అభిమానిస్తూ ఉంటారు. ఆమె ను సీరియల్స్ లో పెద్ద వయసు ఉన్న పాత్రలో చూసి సోషల్‌ మీడియాలో ఈమె ఫోటోలు చూసిన వారు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాబోయ్ జగతి మేడం ఇంత వయసు తక్కువ అమ్మాయిగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. పాతికేళ్ల అమ్మాయి మాదిరిగా జ్యోతి రాయ్ సోషల్‌ మీడియా లో షేర్‌ చేసిన ఫోటోలు ఉంటాయి అనే కామెంట్స్ వస్తూ ఉంటాయి.

తాజాగా మరోసారి జ్యోతిరాయ్ ఫోటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది. రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్న ఈమె మరోసారి క్లీవేజ్ షో అందాలతో కవ్విస్తూ కన్నుల విందు చేస్తుంది. సాధారణంగా హీరోయిన్స్ కి సోషల్‌ మీడియాలో తెగ పాపులారిటీ ఉంటుంది. బుల్లి తెర స్టార్స్ అంటే లైట్‌ తీసుకుంటారు. కానీ జ్యోతి రాయ్ కి మాత్రం హీరోయిన్స్ రేంజ్‌ లో గుర్తింపు ఉంది అనడంలో సందేహం లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలకు లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్స్ షేర్స్ నమోదు అవుతున్నాయంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కన్నడకు చెందిన జ్యోతి రాయ్‌ వయసు నాలుగు పదుల వయసుకు చేరువ అయింది. కానీ పాతికేళ్ల అమ్మాయి మాదిరిగానే కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరోసారి జ్యోతి రాయ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోల వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కన్నడ సీరియల్స్ ద్వారా కెరీర్‌ ను ప్రారంభించిన ఈమె తెలుగు లో ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ పాపులారిటీతోనే సిరిమాల్లో, సిరీస్‌ ల్లోనూ నటిస్తూ కెరీర్‌ లో ముందుకు సాగుతోంది. ఈ స్థాయి అందాల ఆరబోత కేవలం జగతి మేడంకే చెల్లింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

జ్యోతి రాయ్ ఓకే అనాలే గాని వరుసగా ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు సైతం రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమె గతంలో కన్నడ దర్శకుడు సుక్కు పూర్వాజ్ తో రిలేషన్ లో ఉందనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్‌, నో మోర్‌ సీక్రెట్స్ అనే వెబ్‌ సిరీస్ ల్లో నటిస్తోంది. త్వరలోనే ఆ వెబ్‌ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ ఈమెకు ఉన్న క్రేజ్ కారణంగా అన్ని భాషల్లోనూ డబ్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సోషల్‌ మీడియాలో తరచూ అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తున్న జ్యోతి రాయ్ మరి కొంత కాలం ఇదే అందంతో అలరించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటూ ఉన్నారు.

Tags:    

Similar News