ఇంటి బయట వరకే స్టార్‌డమ్!
జ్యోతిక తాజాగా నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ఈ నెల 28న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాల్ని షేర్ చేసుకుంది జ్యోతిక.
నటి జ్యోతిక కెరీర్ స్టార్టింగ్ నుంచి తనదైన గుర్తింపు తెచ్చుకుని నటిగా కంటిన్యూ అవుతుంది. స్టార్ నటుడు సూర్యను పెళ్లి చేసుకుని మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న జ్యోతిక ప్రస్తుతం నటిగా బిజీగా ఉంది. జ్యోతిక తాజాగా నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ఈ నెల 28న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాల్ని షేర్ చేసుకుంది జ్యోతిక.
డబ్బా కార్టెల్ సిరీస్ చేయడానికి ముఖ్య కారణం కథేనని, ఈ సిరీస్ లో కంటెంటే కింగ్ లా వ్యవహరిస్తుందని, ఈ సిరీస్ లో భాగంగా షబానా అజ్మీ లాంటి గొప్ప వ్యక్తితో వర్క్ చేయడం మరింత సంతోషాన్ని కలిగించిందని, ఆమె పక్కన నిల్చుంటేనే ఏదో తెలియని పవర్ ఉంటుందని, తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది జ్యోతిక.
ఇక నటిగా తాను చాలా సంతృప్తికరంగా ఉన్నానని చెప్తుంది జ్యోతిక. తాను ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేశానని, అన్నింటిలో మోజి సినిమా అంటే తనకెంతో ఇష్టమని చెప్తున్న జ్యోతిక, ఆ సినిమాలో తను చేసిన మూగ, చెవిటి పాత్ర తన కెరీర్లో మైల్ స్టోన్ లాంటిదని అభిప్రాయపడింది. కెరీర్ పరంగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ అనుకున్న స్థాయి సక్సెస్, ఆఫర్లు రాలేదని చెప్పింది.
అదే టైమ్ లో సౌత్ లో ఓ సినిమాకు సైన్ చేశానని, కోలీవుడ్ లో చేసిన ఫస్ట్ మూవీనే తన భర్తతో కలిసి చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ సినిమా తర్వాత తమిళంలో వరుస ఆఫర్లు వచ్చి అక్కడే సెటిలైపోయినట్టు తెలిపింది జ్యోతిక. అయితే హిందీలో ఆఫర్లు రాలేదని ఎప్పుడూ బాధ పడలేదని, తన కెరీర్లో సౌత్ లో ఎన్నో గొప్ప సినిమాలు చేశానని, ఒకవేళ హిందీలో బిజీగా ఉండి ఉంటే ఆ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చేది కాదు కదా అనుకుంటానని, ఇప్పుడు మళ్లీ 27 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చింది, ఈసారి ఆడియన్స్ ఆదరిస్తారని నమ్ముతున్నట్టు జ్యోతిక తెలిపింది.
ఇక పిల్లల విషయంలో తామిద్దరం ఎంతగానో ఆలోచిస్తామని, సూర్య, తను ఇద్దరూ ఇంటి బయటే తమ స్టార్‌డమ్ ను వదిలేస్తామని, ఇంట్లో తాము తమ పిల్లలకు పేరెంట్స్ మాత్రమేనని, ప్రతి రోజూ ఉదయాన్నే వారి బాక్స్‌ల్లో ఎలాంటి ఫుడ్ పెట్టాలని ఇద్దరం ఆలోచిస్తామని, పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తామని జ్యోతిక వెల్లడించింది.