సౌత్ లో నటిగా కంటిన్యూ అవడం చాలా కష్టం: జ్యోతిక
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జ్యోతిక దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.;
కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తనదైన గుర్తింపు తెచ్చుకుని మంచి నటిగా కొనసాగుతుంది హీరోయిన్ జ్యోతిక. మొదట హిందీ సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన జ్యోతికకు అక్కడ అనుకున్న స్థాయి సక్సెస్, ఆఫర్లు రాలేదు. అదే టైమ్ లో జ్యోతికకు సౌత్ నుంచి ఓ సినిమా ఆఫర్ రావడంతో దానికి సైన్ చేసింది.
జ్యోతిక తమిళంలో చేసిన మొదటి సినిమాను సూర్యతో కలిసి చేసింది. ఆ సినిమా తర్వాత తనకు వరుస ఆఫర్లు రావడంతో కోలీవుడ్ లోనే సెటిలైపోయింది జ్యోతిక. హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుని మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్న జ్యోతిక తర్వాత మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. కోలీవుడ్ లో సెటిల్ అయ్యాక బాలీవుడ్ వైపు చూడటమే మానేసింది జ్యోతిక.
కానీ గతేడాది మళ్లీ మాధవన్ తో కలిసి సైతాన్ సినిమాతో బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ఆ మూవీతో మంచి హిట్ అందుకుంది. పాతికేళ్ల తర్వాత హిందీలో చేసిన సైతాన్ తర్వాత జ్యోతిక కు బాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది జ్యోతిక.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జ్యోతిక దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిగా కంటిన్యూ అవడం చాలా కష్టమని ఆమె పేర్కొన్నారు. 28 ఏళ్లకే ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాని చెప్తున్న జ్యోతిక, ఆ తర్వాత కూడా ఎన్నో భిన్న పాత్రలు చేస్తూ సినిమాల్లో నటిస్తున్నానని, కానీ తనకు ఇప్పటివరకు ఏ స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ రాలేదని తెలిపారు.
సౌత్ లో ఎవరైనా కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయడంటే అది చాలా పెద్ద ఛాలెంజేనని, అప్పట్లో బాలచందర్ లాంటి డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసేవాళ్లు. కానీ ఈ రోజుల్లో అలా ఎవరూ తీయట్లేదని, స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తున్నారని, సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రావడం పూర్తిగా తగ్గిపోయిందని, దానికి బడ్జెట్ తో పాటూ మహిళల వయసు కూడా ఓ కారణమని తెలిపారు.
అంతేకాదు, సౌత్ లో మహిళల కోసం మంచి కథలు రాసే రైటర్లు సైతం తగ్గిపోయారని, అందుకే దక్షిణాదిలో నటిగా ఎదగడమంటే ఒంటరిగా పోరాటం చేయడమేనని ఆమె తెలిపారు. సౌత్ లో పలు సినిమాల్లో నటించి చాలా కాలం పాటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జ్యోతిక ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీపై ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.