'క' ఓటీటీ.. అడ్వాన్స్ ఫీచర్స్ తో మరింత స్పెషల్ గా..

దీంతో ఇప్పుడు టాలీవుడ్ మూవీ లవర్స్.. క సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు.

Update: 2024-11-27 04:21 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రీసెంట్ గా 'క' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. ఫాంట‌సీ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ గా సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఆ మూవీ.. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న థియేట‌ర్ల‌లో రిలీజైంది. బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద యాభై కోట్ల‌కుపైగా వసూళ్లను రాబట్టింది.

థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ ను కంప్లీట్ చేసుకున్న ఆ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరికొన్ని గంటల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో విడుదలకు ముందే క డిజిటల్ రైట్స్ ను ఈటీవీ విన్ ఓటీటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు నవంబర్ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. కేవలం తెలుగు వెర్షన్ విడుదల అవ్వనుంది.

దీంతో ఇప్పుడు టాలీవుడ్ మూవీ లవర్స్.. క సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఓటీటీలో మరోసారి చూడాలని తహతహలాడుతున్నారు. అలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా క సినిమా పోస్టులే కనిపిస్తున్నాయి. అయితే అధునాతన ఫీచర్లతో క సినిమాను ఓటీటీలోకి తీసుకురానుంది ఈటీవీ విన్. ఆడియన్స్ ను సరికొత్త అనుభూతిని అందించనుంది.

డాల్బీ విజన్‌ : అట్మాస్ టెక్నాలజీలతో మాస్టర్ పీస్ 'క' సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది ఈటీవీ విన్ ఓటీటీ. తమ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో తొలిసారి అధునాతన ఫీచర్స్ తో కూడిన మూవీగా 'క'ను అందుబాటులోకి తేనుంది. ఓటీటీలు ఓ రేంజ్ లో పోటీపడుతున్న ప్రస్తుత రోజుల్లో తాను కూడా సత్తా చాటాలని ఈటీవీ విన్ ప్రయత్నిస్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది.

కథేంటంటే? సినిమాలో అభినయ్‌ వాసుదేవ్‌ (కిరణ్‌ అబ్బవరం) ఓ అనాథ. ఇతరులకు వచ్చే ఉత్తరాలు చదువుతూ.. తన సొంత వాళ్లే రాశారని ఊహించుకుంటూ.. పోస్ట్ మ్యాన్ గా ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. అలా అలవాటుగా ఓ రోజు ఉత్తరం చదువుతుండగా అతడికి ఆ ఊరిలో కనిపించకుండా పోయిన అమ్మాయిల గురించి ఓ విషయం తెలుస్తుంది.

ఆ తర్వాత హీరో జీవితంలో ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయనే ప్రశ్నల చుట్టూ సినిమా సాగింది. ముఖ్యంగా క మూవీ కాన్సెప్ట్‌ తో పాటు ట్విస్టులు ఆడియెన్స్‌ ను తెగ ఆక‌ట్టుకున్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ వేరే లెవెల్ లో మెప్పించింది. అలా కిరణ్ అబ్బవరం.. చిన్న గ్యాప్ తర్వాత మంచి హిట్ అందుకుని సత్తా చాటారు. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనున్నారు.

Tags:    

Similar News