పిక్‌టాక్ : పార్వతిదేవిగా చందమామ

అందుకే ఆమె మెల్లగా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకునే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తూ వస్తుంది.

Update: 2025-01-06 07:31 GMT

చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కాస్త వెనుక పడింది అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో సినిమాలు చేసి సీనియర్‌, జూనియర్‌, స్టార్‌, సూపర్‌ స్టార్‌, కొత్త హీరోలు ఇలా అందరితోనూ సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్‌ ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. పెళ్లి అయ్యి తల్లి అయిన తర్వాత కాజల్‌ అగర్వాల్‌ మునుపటి మాదిరిగా సినిమాలు చేయాలని భావించినా సాధ్యం కావడం లేదు. ఆమెకు కోరుకున్న ఆఫర్లు దక్కడం లేదు. అందుకే ఆమె మెల్లగా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకునే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తూ వస్తుంది.


గెస్ట్‌ అప్పియరెన్స్‌, ముఖ్య పాత్రలకు కాజల్‌ అగర్వాల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. అందులో భాగంగానే మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న కన్నప్ప సినిమాలో కీలకమైన పార్వతీదేవి పాత్రలో నటించింది. శివుని భక్తుడి సినిమా అయిన కన్నప్పలో పార్వతి దేవికి ఏ స్థాయి పాత్ర ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనుక ఆమె కనిపించేది కొద్ది సమయం అయినా కథలో కీలకం అయ్యి ఉంటుంది. అంతే కాకుండా ఆమె కనిపించే సీన్స్ సినిమాకు అత్యంత కీలకంగా ఉంటాయనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

కాజల్‌ అగర్వాల్‌ కన్నప్ప సినిమాలో నటిస్తున్నట్లుగా మేము గతంలోనే చెప్పుకొచ్చాము. కన్నప్ప కోసం కాజల్‌ అగర్వాల్‌ చాలా రోజుల క్రితమే షూటింగ్‌ను ముగించింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మెల్ల మెల్లగా చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాలో నటించిన వారిని పరిచయం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం మోహన్‌లాల్‌ లుక్‌ను రివీల్‌ చేసిన మేకర్స్‌ ఇప్పుడు చందమామ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ లుక్‌ను రివీల్‌ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో కాజల్‌ అగర్వాల్‌ లేబా ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే.

ఇలాంటి సమయంలో కన్నప్ప వంటి సినిమాలో ముఖ్య పాత్రలో కాజల్‌ నటించడం ద్వారా కచ్చితంగా ఆమె కెరీర్‌కి కీలకం అనడంలో సందేహం లేదు. పార్వతి దేవి గా గతంలో నటించిన వారు ఎంతో మంది మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సీరియల్స్‌లో పార్వతి దేవి పాత్రలో నటించిన వారు హీరోయిన్గా నిలిచారు. అందుకే కాజల్ అగర్వాల్‌ ను హీరోయిన్‌గా చూడటం ద్వారా ముందు ముందు ఆమెను మరిన్ని మంచి పెద్ద సినిమాల్లో చూసే అవకాశం వస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కన్నప్ప ఈ ఏడాది ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ముకేష్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News