ఫ్లైట్ కూలి నేను చనిపోయానని ఇంటికి ఫోన్ చేసారు: కాజోల్
బాలీవుడ్ నటి కాజోల్ అంతగా కమ్యూనికేషన్ లేని రోజుల్లో తనపై వచ్చిన కొన్ని తప్పుడు వార్తా కథనాల గురించి తన కుటుంబం ఎంతగా కలతకు గురైందో వెల్లడించింది.
బాలీవుడ్ నటి కాజోల్ అంతగా కమ్యూనికేషన్ లేని రోజుల్లో తనపై వచ్చిన కొన్ని తప్పుడు వార్తా కథనాల గురించి తన కుటుంబం ఎంతగా కలతకు గురైందో వెల్లడించింది. తాను ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోయిందని తన ఇంటికి ఫోన్ చేసి చెప్పారని, ఇలాంటి బూటకపు పోన్ కాల్స్‌తో తనవారు ఎంతగా ఆందోళన చెందారో కూడా వెల్లడించింది. `గ్రేట్ ఇండియన్ కపిల్ షో`లో పాల్గొన్న కాజోల్ ఈ తప్పుడు కథనాలు తనను ఎన్ని సంవత్సరాలుగా వెంటాడుతున్నాయో వివరించింది. షోలో పాల్గొన్న సహతారలు కృతి సనన్, షాహీర్ షేక్ ఇది విని నిజంగా ఆశ్చర్యపోయారు.
మీ కుమార్తె విమానం కూలిపోయిందంటూ కాజోల్ తల్లి తనూజకు ఫోన్ కాల్స్ వెళ్లేవట. ఇలా చాలా సార్లు జరిగింది. సోషల్ మీడియాలు లేని రోజుల్లో ఇలాగే జరిగేది. ఎవరో మా అమ్మకి ఇంటికి ఫోన్ చేసి నా విమానం కూలిపోయి నేను మరణించానని చెప్పారు అని కాజోల్ తన అనుభవాన్ని వెల్లడించారు. తక్షణ కమ్యూనికేషన్ అందుబాటులో లేని రోజుల్లో ఇలాంటి వార్తలు మరింత బాధాకరమైనవి. ఇది దాదాపు ప్రతి ఐదు నుండి పదేళ్లకు ఒకసారి జరుగుతుంది! అని తెలిపింది.
ఒక వైరల్ వీడియోలో కాజోల్ `ఇక లేదు` అని కూడా ప్రచారం చేసారట. తనకు అనారోగ్యంగా ఉందని కూడా కొందరు తప్పుడు ప్రచారం చేసారని తెలిపింది. ఇలాంటి వింత వార్తలను చూసేందుకు తన స్నేహితులు , కుటుంబ సభ్యులు రెగ్యులర్ గా గూగుల్‌ని చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎవరైనా నాకు వార్తలను ఫార్వార్డ్ చేసి, చూడండి! మీ గురించి కొన్ని వింత వార్తలు ఉన్నాయి! ఏం జరుగుతోంది? అని అడిగేవారట.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కాజోల్ ఇటీవలి చిత్రం `దో పట్టి` ఓటీటీలో ఆకట్టుకుంది. ఈ థ్రిల్లర్‌లో కాజోల్ ఒక పోలీసు పాత్రను పోషించారు.