చిన్న వ‌య‌సులో లెక్క‌లేన‌ని ఎఫైర్లా?

ఇండ‌స్ట్రీలో ఎఫైర్లు అంటే ముందుగా గుర్తొచ్చే ఇండ‌స్ట్రీ బాలీవుడ్ అని చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-09-29 12:30 GMT

ఇండ‌స్ట్రీలో ఎఫైర్లు అంటే ముందుగా గుర్తొచ్చే ఇండ‌స్ట్రీ బాలీవుడ్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం ఎఫైర్ వార్త‌ల‌తో బాలీవుడ్ అగ్ర స్థానంలోనే క‌నిపిస్తుంది. ఎఫైర్ల విష‌యంలో కొత్త స‌మాచార‌మంతా అక్క‌డ నుంచి డంప్ అవుతుంటుంది. తాజాగా బాలీవుడ్ న‌టి క‌ల్కి కొచ్లిన్ వ్య‌వ‌హారాన్ని అమ్మ‌డు బ‌ట్ట బ‌య‌లు చేసింది. ఎవ‌రైనా ఇలాంటి విష‌యాలు దాచ‌డానికి ప్ర‌య‌త్న‌స్తుంటారు. కానీ క‌ల్కి కొచ్లిన్ మాత్రం అంతా ఓపెన్ అంటూ ముందుకెళ్తోంది.

అమ్మ‌డు ఒకే సారి మ‌ల్టీపుల్ ల‌వ్ స్టోరీలు న‌డ‌పిన‌ట్లు తెలిపింది. `ఒకే స‌మ‌యంలో ప‌లువురి తో డేటింగ్ చేసా. నాజీవితంలో అదొక డిఫ‌రెంట్ జ‌ర్నీ. అప్పుడు నా వ‌య‌సు చిన్న‌ది. అదంతా తెలియ‌క‌నే చేసాను. ఇప్పుడు పెళ్లి అయింది. పిల్ల‌లు ఉన్నారు. జీవితం ఎంతో సంతోషంగా ఉంది. కాబ‌ట్టి ఇప్పుడు నేను అలాంటి వాటి గురించి ఆలోచించాల్సిన ప‌నిలేదు. నా లైఫ్ పార్ట‌న‌ర్ గురించి ప‌ట్టించుకునే స‌మ‌యం కూడా లేదు.

కానీ జీవితంలో విష‌యంలో కొన్ని స‌రిహ‌ద్దులు గీసుకుని ముందుకు సాగుతున్నా` అని తెలిపింది. ప్ర‌స్తుతం ఆవ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్అవుతున్నాయి . క‌ల్కి కొచ్లిన్ తొలుత బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్యప్ ని వివాహం చేసుకుంది. అనంత‌రం అత‌డితో 2015 లో విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత ఇజ్రెయిల్ మ్యూజిషియ‌న్ గ‌య్ హెర్ష్ బ‌ర్గ్ తో ప్రేమ‌లో ప‌డింది. ఆప్రేమ‌కు గుర్తుగా 2020 లో కుమార్తె కూడా జ‌న్మించింది.

అయిత గ‌య్ ని వివాహం చేసుకుని త‌ల్లి అయిందా? కాకుండా త‌ల్లి అయిందా? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. క‌ల్కి చేసిన సినిమాల సంగ‌తి చూస్తే దేవ్ డీ, షైతాన్, జింద‌గీనా మిలేగా దొబారా, యేజ‌వానీ హై దివానీ, వెయిటింగ్, మార్గ‌ర‌ట్ విత్ స్ట్రా, గ‌ల్లిబోయ్ లాంటి సినిమాల్లో న‌టించింది.

Tags:    

Similar News