ట్యాలెంటెడ్ మిక్కీ జే జాక్ పాట్ మిస్!
సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ ని సంగీతం అందించే అదృష్టం వరించింది.
ఒకే ఒక్క గ్రాండ్ సక్సెస్ ప్రతిదీ మార్చేస్తుంది. కెరీర్ గ్రాఫ్ అమాంతం స్కైలో తేల్తుంది. అందుకు ఫక్తు ఉదాహరణ సంతోష్ నారాయణన్. ఈ తమిళ యువ సంగీత దర్శకుడు అనూహ్యంగా మిక్కీ జే మేయర్ ని రీప్లేస్ చేస్తూ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడి టీమ్ తో చేరాడు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ ని సంగీతం అందించే అదృష్టం వరించింది.
కల్కి 2898 సంచలన విజయం సాధించడంతో సంతోష్ కెరీర్ వెనుదిరిగి చూసుకోనంత స్పీడ్ అందుకుంది. అంతకుముందు కూడా అతడు బిజీ సంగీత దర్శకుడే అయినా కానీ, ఈ స్థాయి పాన్ ఇండియా హిట్ చిత్రానికి అతడు పని చేయలేదు గనుక మేకర్స్ చూపంతా సంతోష్ నారాయణ్ పైకి మళ్లింది. ఇప్పటికిప్పుడు అతడు ప్రభాస్ సహా ఇండస్ట్రీ అగ్ర హీరోలందరికీ ఒక ఆప్షన్ గా మారాడు.
ప్రస్తుతం సూర్య- కార్తీక్ సుబ్బరాజు మూవీ చేస్తున్నాడు. తదుపరి కల్కి 2898 ఏడి సీక్వెల్ కి పని చేయాల్సి ఉంది. త్వరలోనే నాగ్ అశ్విన్ తో కలిసి రికార్డింగ్ కార్యక్రమాల్లో కూచుంటాడట. అలాగే నాని- శ్రీకాంత్ ఓదెలా తదుపరి మూవీకి సంతోష్ నారాయణ్ పని చేసే అవకాశం ఉంది. దసరా తర్వాత తిరిగి ఈ కాంబో రిపీటవుతోంది. అలాగే శ్రీకాంత్ ఓదెల సినిమాలకు సంతోష్ వరుసగా పని చేసే వీలుంది. చిరంజీవి-శ్రీకాంత్ ఓదెలా సినిమా కూడా అతడినే వరించే ఛాన్సుందని తెలుస్తోంది.
అయితే మిక్కీ జే మేయర్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో నాగ్ అశ్విన్ ఛాయిస్ ని చెడామడా తిట్టేస్తున్నారు. సంతోష్ నారాయణన్ కల్కి 2898 ఏడి కోసం ఇచ్చిన బీజీఎం కానీ, పాటలు కానీ ఏవీ నచ్చలేదని విమర్శిస్తున్నారు. కల్కి లాంటి పాన్ ఇండియన్ సినిమాకి సంగీతం పరంగా ప్రమాణాలు హాలీవుడ్ రేంజుకు తగ్గకూడదు. అలాంటి పని కేవలం మ్యాస్ట్రో ఇళయరాజా మాత్రమే చేయగలరు. అలానే నేటితరంలో మిక్కీ జే మేయర్ పనితనంపైనా రెడ్డిటర్లు నమ్మకంగా ఉన్నారు. సంతోష్ నారాయణ్ కంటే కూడా మిక్కీ జే మేయర్ అయితేనే కల్కి 2898 ఏడి స్థాయి పెరిగేది అని కామెంట్ చేస్తున్నారు.