కల్కి-2.. ఎంతవరకు వచ్చిందంటే..
భారీ బడ్జెట్ తో ప్రముఖ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్రముఖ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆడియన్స్ ను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.
అయితే కల్కి మూవీకి సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడిస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాత అశ్వనీదత్ ఓ సందర్భంలో తెలిపారు. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయిందని చెప్పారు.
ఇప్పుడు గోవాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కల్కి నిర్మాతలు, అశ్వనీదత్ కుమార్తెలైన స్వప్న, ప్రియాంక.. కల్కి సీక్వెల్ కోసం మాట్లాడారు. షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. పార్ట్ 2కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
అన్నీ సిద్ధమయ్యాక అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని తెలిపారు. కల్కి 2898 ఏడీతో పాటు సీక్వెల్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కొంతమేర ఇప్పటికే తీసినట్లు చెప్పారు. పార్ట్ 2కు సంబంధించి ఇప్పటి వరకు 35 శాతం షూట్ జరిగిందని వెల్లడించారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె పార్ట్ -2లో కూడా నటిస్తున్నట్లు తెలిపారు.
సీక్వెల్ లో కూడా దీపిక.. కొన్ని సీన్స్ లో అమ్మగా కనిపించనున్నారని చెప్పారు. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు దీపిక గర్భిణీ. మూవీ రిలీజ్ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. గోవాలో జరుగుతున్న ఇప్ఫీ వేడుకల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉందని ప్రియాంక, స్వప్న తెలిపారు. టాలీవుడ్ కు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
ఇక కల్కి సినిమా విషయానికొస్తే.. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ మెప్పించారు. వారితో పాటు ఎంతో మంది యాక్టర్స్ సందడి చేశారు. బౌంటీ ఫైటర్ భైరవగా, చివర్లో కర్ణుడిగా ఆకట్టుకున్నారు ప్రభాస్. అలా పార్ట్-2పై మంచి అంచనాలు పెంచారు. మరి కల్కి సీక్వెల్ నుంచి ఫ్యూచర్ లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేచి చూడాలి.